RBI Repo Rate Hike: మరోసారి రెపో రేటును పెంచిన ఆర్‌బీఐ... బ్యాంకు రుణాలపై పెరగనున్న వడ్డీ భారం..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి 'రెపో రేటు'ను పెంచేసింది. రెపో రేటు అంటే బ్యాంకులకు ఆర్‌బీఐ ఇచ్చే నిధులపై వసూలు చేసే వడ్డీ రేటు. రెపో రేటు పెరిగిందంటే బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి.

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 5, 2022, 11:31 AM IST
  • మరోసారి రెపో రేటు పెంచిన ఆర్‌బీఐ
  • ప్రకటించిన ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
  • బ్యాంక్ రుణాలపై పెరగనున్న వడ్డీ భారం
RBI Repo Rate Hike: మరోసారి రెపో రేటును పెంచిన ఆర్‌బీఐ... బ్యాంకు రుణాలపై పెరగనున్న వడ్డీ భారం..

RBI Repo Rate Hiked: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి రెపో రేటును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గత జూన్ నెలలో 50 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును పెంచిన ఆర్‌బీఐ.. తాజాగా మరో 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో 4.90 శాతంగా ఉన్న రెపో రేటు ప్రస్తుతం 5.40 శాతానికి చేరింది. గత రెండు రోజులుగా జరుగుతున్న మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ రెపో రేటు పెంపుపై శుక్రవారం (ఆగస్టు 5) అధికారిక ప్రకటన చేశారు. 

గడిచిన కొద్ది నెలల్లో ఇండియన్ మార్కెట్ నుంచి 13.3 బిలియన్ల పెట్టుబడులు ఉపసంహరించబడినట్లు శక్తికాంత దాస్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో, మూడో త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 6 శాతం కన్నా ఎక్కువే ఉండొచ్చునని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. వంట నూనెల ధరలు దిగొచ్చే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. 

ఆగస్టు 2019 తర్వాత రెపో రేటు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో కొన్నాళ్ల పాటు రెపో రేటు తగ్గిస్తూ వచ్చిన ఆర్‌బీఐ ఇప్పుడు పెంపు పైనే దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. తాజాగా పెంచిన రెపో రేటుతో బ్యాంక్ కస్టమర్స్‌‌కి రుణాలపై వడ్డీ భారం పెరగనుంది.నిజానికి రెపో రేటు పెంపు 35 బేసిస్ పాయింట్స్ ఉండొచ్చునని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. కానీ అంతకుమించి 50 బేసిస్ పాయింట్స్ మేర ఆర్‌బీఐ రెపో రేటును పెంచింది. 

రుణాలపై పెరగనున్న వడ్డీ భారం :

దేశంలోని కమర్షియల్ బ్యాంకులన్నీ నిధుల కోసం ఆర్‌బీఐ పైనే ఆధారపడుతాయి. బ్యాంకులకు ఇచ్చే నిధులపై ఆర్‌బీఐ వసూలు చేసే వార్షిక వడ్డీ రేటునే రెపో రేటు అంటారు.  రెపో రేటు పెరిగిందంటే ఆర్‌బీఐ నుంచి తీసుకునే రుణాలకు బ్యాంకులు ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. దీన్ని బ్యాలెన్స్ చేసుకునేందుకు కస్టమర్స్‌కి ఇచ్చే రుణాలపై బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతాయి. దీంతో గృహ, వాహన, వ్యక్తిగత ఇతరత్రా రుణాలపై వడ్డీ భారం పెరుగుతుంది. 

Also Read: చరిత్ర సృష్టించిన సుధీర్.. పారా పవర్‌ లిఫ్టింగ్‌లో భారత్‌కు తొలి స్వర్ణం!

Also Read: UP Tragic Incident: పాము కాటుతో అన్నాదమ్ముల మృతి.. అన్న అంత్యక్రియలకు హాజరై అదే పాము కాటుకు బలైన తమ్ముడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News