Heavy Rains Warning: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన బంగాళాఖాతం ఇప్పుడు తీవ్ర అల్పపీడనంగా మారుతోంది. ఫలితంగా రానున్న రెండ్రోజుల్లో ఏపీలోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది. దీనికితోడు మరో అల్పపీడనం ముంచుకు రానుంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు తీవ్ర అల్పపీడనంగా బలపడుతోంది. ఈ అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. రేపటికి నైరుతి బంగాళాఖాతంలోప్రవేశించి తమిళనాడు, శ్రీలంక తీరంవైపుకు వెళ్లే అవకాశాలున్నాయి. ఫలితంగా రానున్న రెండ్రోజుల్లో ఏపీలోని అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్రలోని నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాలపై ఎక్కువ ప్రభావం ఉండవచ్చు. ఇక రానున్న రెండ్రోజుల్లో కడప, సత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు, నెల్లూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.
మరోవైపు ఈ నెల 15న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ అంచనా వేస్తోంది. దాంతో ఈ నెల 15 నుంచి ఏపీలోని కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఈ క్రమంలో రైతుల నుచి వరి ధాన్యాన్ని ముందే కొనుగోలు చేస్తున్నారు. పండించిన ధాన్యాన్ని తేమ తగలకుండా సురక్షితంగా ఉంచాలని, 25 శాతం తేమ దాటితే కొనుగోలు చేయమని ప్రభుత్వం చెబుతోంది. వరి కుప్పలపై ఎకరానికి 25 కిలోల ఉప్పు చల్లుకుంటే నష్టం తగ్గించవచ్చని వ్యవసాయ శాఖాధికారులు సూచిస్తున్నారు. వరి పనలపై ఉప్పుతో కూడిన ద్రావణాన్ని పిచికారీ చేస్తే తడిచినా గింజ మొలకెత్తకుండా పాడవకుండా ఉంటుందంటున్నారు. బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
Also read: Jamili Election: శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు, ఎన్నికలెప్పుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.