Ap Rains Alert: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ప్రస్తుతం ఈ ఆవర్తనం సముద్రమట్టానికి 3.2 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఈ ఆవర్తనం కారణంగా ఏపీ అంతటా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది. ఉత్తర కోస్తాలో మాత్రం మరో రెండ్రోజులు పొడి వాతావరణం ఉండనుంది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 9వ తేదీ అంటే నిన్న ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఫలితంగా రానున్న మూడు రోజులు అంటే సంక్రాంతి వరకూ మోస్తరు వర్షసూచన జారీ అయింది. ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈనెల 10, 12, తేదీల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇక రాయలసీమలో కూడా ఈ నెల 13 వరకూ మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావం మరో నాలుగు రోజులు ఉండనుంది. అందుకే ఏపీలోని దాదాపు అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. తెలంగాణకు వర్షసూచన లేదు కానీ ఈ నెల 15 వరకూ పొగమంచు ఉంటుంది.
మొన్నటి వరకూ కురిసిన వర్షాలతో ఏపీలో రైతాంగం ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఇప్పుడు మళ్లీ వర్ష సూచన జారీ కావడంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. భారీ వర్షాలు కాకపోయినా పంట కోసిన సమయం కావడంతో ఈ సమయంలో వర్షాలు మంచివి కావు.
Also read: Inter Exams New Patter: ఇంటర్ పరీక్షల విధానంపై క్లారిటీ, వచ్చే ఏడాది నుంచి కొత్త విధానం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.