COVID-19 treatment: అమరావతి: కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఏపీస్ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని ( APS RTC staff ) కరోనా భయం వెంటాడుతోంది. పట్టణాల నుంచి పల్లెల వరకు ప్రయాణికులలో కలిసిపోయి విధులు నిర్వర్తిస్తున్న తమకు కరోనా సోకితే తమ పరిస్థితేంటని ఆర్టీసీ సిబ్బంది ఆందోళన వ్యక్తంచేస్తోన్న నేపథ్యంలో.. వారికి ఏపీ సర్కార్ ( AP govt ) అండగా నిలిచింది. ఆర్టీసీ సిబ్బందికి కరోనావైరస్ సోకితే.. కార్పొరేటు ఆస్పత్రులలో వైద్యం అందించేందుకు వీలుగా చర్యలు చేపట్టింది. ఏపీ సర్కార్ ఆదేశాల మేరకు ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మిన్) కోటేశ్వర రావు మీడియాకు తెలిపారు. ఏపీస్ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంతో కోవిడ్-19 ( COVID-19 ) సోకిన ఆర్టీసి సిబ్బందితో పాటు కరోనా బారిన పడిన వారి కుటుంబసభ్యులకు సైతం కార్పొరేటు ఆస్పత్రుల్లో కరోనాకు చికిత్స అందనుంది.
( Also read: Covid-19: రికార్డు స్థాయిలో కరోనా కేసుల నమోదు )
ఆర్టీసీ సిబ్బంది ఆరోగ్యాన్ని, వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అటు ఏపీ సర్కార్, ఇటు ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయంపై ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు ( RTC employees unions ) హర్షం వ్యక్తంచేశారు. అయితే, అదే సమయంలో కరోనాను లెక్కచేయకుండా ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న ఏపీస్ ఆర్టీసీ సిబ్బందికి రూ. 50 లక్షల కోవిడ్-19 బీమాను ( COVID-19 insurance ) సైతం వర్తింపజేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఏపీ సర్కారుకు విజ్ఞప్తి చేశాయి. Also read: AP: కొత్త జిల్లాలకు రంగం సిద్ధం, కమిటీ ఏర్పాటు