మానవత్వాన్ని చాటుకున్న స్పీకర్ కోడెల

                     

Updated: Jun 9, 2018, 11:00 AM IST
మానవత్వాన్ని చాటుకున్న స్పీకర్ కోడెల

నరసరావుపేట: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ క్షతగాత్రుడిని తన కాన్వాయ్ వాహనంలో ఆస్పత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రముఖ మీడియా కథనం ప్రకారం షేక్‌ కరీముల్లా, ఆంజనేయులు  సత్తెన‌పల్లి నుంచి నరసరావుపేట వైపు బైక్ వెళ్తున్నండగా  ముప్పాళ్ల మండలం ఇరుకుపాలెం వద్ద వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కరిముల్లా అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి ఆంజనేయులుకు తీవ్ర గాయాలయ్యాయి.

అదే సమయంలో అటువైపు వెళ్తన్న స్పీకర్ కోడెల శివప్రసాదరావు తన కాన్వాయ్ ను ఆపారు. సంఘటన స్థలాన్ని చూసి చలించిపోయారు..అంబులెన్స్ వచ్చే లోపే తన కాన్వాయ్ వాహనంలో ఆంజనేయులును సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు  తరలించారు. క్షతగాత్రుడికి మెరుగైన వైద్య సహాయం అందించాలని వైద్యలను కోడెల ఆదేశించారు.