Badvel By Election Dasari Sudha wins: బద్వేలు ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ భారీ విజయం

Dasari Sudha wins byelection to Andhra Pradeshs Kadapa district Badvel assembly seat :తొలి రౌండ్‌ నుంచే ఆధిక్యంలో దూసుకెళ్లింది  వైఎస్సార్సీపీ (YSRCP) . ఆ పార్టీ అభ్యర్థిని దాసరి సుధ భారీ విజయం సాధించారు.వైఎస్సార్సీపీ (YSRCP) ఆధిక్యం ముందు ఇతర పార్టీలేవి దరిదాపుల్లో కూడా లేవు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 2, 2021, 01:10 PM IST
  • కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ
    హవా..
  • తొలి రౌండ్‌ నుంచే ఆధిక్యంలో దూసుకెళ్లిన వైఎస్సార్సీపీ
  • భారీ మెజార్టీతో దూసుకెళ్లిన దాసరి సుధ
Badvel By Election Dasari Sudha wins: బద్వేలు ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ భారీ విజయం

Badvel By Election Results 2021 YSRCPs Dasari Sudha wins byelection to Andhra Pradeshs Kadapa district Badvel assembly seat : కడప జిల్లా బద్వేలు (Badvel, Kadapa District) ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. వైఎస్సార్సీపీ అభ్యర్థిని దాసరి సుధ భారీ విజయం సాధించారు. వైఎస్సార్‌సీపీ 13 వ రౌండ్‌కల్లా మొత్తంగా 90,550 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపును సొంతం చేసుకుంది. 13 వ రౌండ్లో వైఎస్సార్‌సీపీకి 362 ఓట్లు, బీజేపీకి 40 ఓట్లు, కాంగ్రెస్‌కు 12 ఓట్లు పోల్‌ అయ్యాయి. 13 వ రౌండ్‌కల్లా మొత్తంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ దాసరి సుధ 90,550 ఓట్ల ఆధిక్యంలో కొనసాగారు. తొలి రౌండ్‌ నుంచే వైఎస్సార్సీపీ (YSRCP) ఆధిక్యంలో దూసుకెళ్లింది. అయితే ఎనిమిది రౌండ్లు ముగిసేసరికి వైఎస్సార్సీపీకి 84,682, బీజేపీకి (BJP) 16,190, కాంగ్రెస్‌కు 5,026, నోటాకు 2,830 ఓట్లు పోలయ్యాయి. అప్పటికే వైఎస్సార్సీపీ (YSRCP) ఆధిక్యం ముందు ఇతర పార్టీలేవి దరిదాపుల్లో కూడా లేవు. లెక్కించిన ఓట్లలో వైఎస్సార్సీపీకి పోలైన ఓట్లలో సగం కంటే ఎక్కువ రావడంతో ఉప పోరులో ఎనిమిదో రౌండ్ (Eighth round) ముగిసేసరికే వైఎస్సార్సీపీ గెలిచినట్లైంది.

12వ రౌండ్‌లో 483 ఓట్ల ఆధిక్యం సాధించిన వైఎస్సార్‌సీపీ మొత్తంగా 90,211 ఓట్ల భారీ మెజారిటీ సొంతం చేసుకుంది. అప్పటి వరకు అన్ని రౌండ్లలో కలిపి వైఎస్సార్‌సీపీ 1,11,849 ఓట్లు, బీజేపీ 21,638 ఓట్లు, కాంగ్రెస్‌ 6,223 ఓట్లు సాధించాయి.

11వ రౌండ్లో లభించిన 4584 ఓట్ల మెజారిటీతో వైఎస్సార్‌సీపీ 90,089 ఓట్ల ఆధిక్యం ప్రదర్శించింది. అప్పటివరకు వైఎస్సార్‌సీపీ 1,11,710 ఓట్లు ,బీజేపీ 21,621 ఓట్లు, కాంగ్రెస్‌ 5968 ఓట్లు సాధించింది. 10 రౌండ్లు ముగిసేసరికి వైఎస్సార్‌సీపీ (YSRCP) 85,505 ఓట్ల ఆధిక్యం ప్రదర్శించింది. అప్పటివరకు అన్ని రౌండ్లలో కలిపి వైఎస్సార్‌సీపీ 1,06,088 ఓట్లు సాధించగా.. బీజేపీ (BJP) 20,583, కాంగ్రెస్‌ 5968 ఓట్లు సాధించింది.

Also Read : Huzurabad By Election Result Live Counting: ఐదో రౌండ్ ముగిసేసరికి 2,169 ఓట్ల ఆధిక్యంలో ఈటెల 

8 రౌండ్లు ముగిసేసరికి వైఎస్సార్‌సీపీ (YSRCP)  68,492 ఓట్ల ఆధిక్యంలో కొనసాగింది. 8వ రౌండ్‌లో వైఎస్సార్‌సీపీ 9691, బీజేపీ 1964, కాంగ్రెస్‌కు 774 ఓట్లు పోలయ్యాయి. 68,492 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్‌సీపీ కొనసాగింది.ఏడో రౌండ్‌లో (Seventh round‌) వైఎస్సార్‌సీపీకి 10,726, బీజేపీకి 1924, కాంగ్రెస్‌కు 841 ఓట్లు పోలయ్యాయి. ఏడు రౌండ్లు ముగిసే సరికి వైఎస్సార్‌సీపీ 74991 ఓట్లు సాధించింది.బద్వేలులో ఆరో రౌండ్‌లో (Sixth round‌) వైఎస్సార్‌సీపీకి 11,383, బీజేపీకి 1940, కాంగ్రెస్‌కు 531 ఓట్లు పోలయ్యాయి. ఆరు రౌండ్లు ముగిసేసరికి వైఎస్సార్‌ వైఎస్సార్‌సీపీ 64,265 ఓట్లు సాధించింది.

బద్వేల్‌లో ఐదో రౌండ్‌ ముగిసే సరికి 42,824 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్‌సీపీ కొనసాగింది.నాలుగో రౌండ్‌ (Fourth round‌) ముగిసే సరికి 30,412 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్‌సీపీ కొనసాగింది. మూడో రౌండ్‌ (Third round‌) ముగిసే సరికి 23,754 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్‌సీపీ కొనసాగింది.ఇక తొలి రౌండ్‌లో వైఎస్సార్‌సీపీ 10,478, బీజేపీ 1688, కాంగ్రెస్‌కు 580 ఓట్లు లభించాయి.అంతకంటే ముందు బద్వేల్‌లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. పోస్టల్‌ బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీకే ఆధిక్యం దక్కింది. 

బద్వేలు పట్టణం (Badvel) నెల్లూరు రోడ్డులోని గురుకుల ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగింది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభించారు. నాలుగు కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో కౌంటింగ్‌ కేంద్రంలో ఏడు టేబుళ్లను ఏర్పాటు చేశారు.

Also Read : Badvel Counting Live Updates: బద్వేలులో దూసుకుపోతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News