Badvel Counting Live Updates: అంధ్రప్రదేశ్ బద్వేలు ఉపఎన్నిక ఫలితాలు వెలువడుతున్నాయి. అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పూర్తిగా దూకుడు ప్రదర్శిస్తోంది. తొలి మూడు రౌండ్లకే భారీ మెజార్టీ సాధించింది.
బద్వేలు ఉపఎన్నికలో పూర్తి ఆధిక్యతను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రదర్శిస్తోంది. బద్వేలులో(Badvel Bypolls Results) 11 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. బద్వేలులో ఊహించినవిధంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆదిక్యత కొనసాగుతోంది. ఇప్పటికే బద్వేలులో మూడు రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. తొలి రౌండ్‌లోనే 8 వేల 7 వందల ఓట్ల మెజార్టీ సాధించిన వైసీపీ..రెండు, మూడు రౌండ్లు ముగిసేసరికి 23 వేల ఆధిక్యాన్ని సాధించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచీ చెబుతున్నట్టుగా లక్ష వరకూ మెజార్టీ సాధించవచ్చని అంచనా. బద్వేలులో వైసీపీ(Ysrcp) ఇప్పటి వరకూ 23 వేల 7 వందల ఓట్ల ఆధిక్యం సాధించింది.
బద్వేలులో నాలుగవ రౌండ్ కూడా ముగిసింది. నాలుగవ రౌండ్ ముగిసేసరికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 30 వేల 412 ఓట్ల స్పష్టమైన మెజార్టీతో దూసుకుపోతోంది.
బద్వేలులో ఐదవ రౌండ్ ఫలితాలు కూడా వచ్చేశాయి. ఐదవ రౌండ్ ముగిసేసరికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 40 వేల 3 వందల ఓట్ల భారీ ఆధిక్యంతో ఉంది.
ఏడు రౌండ్ల ముగిసేసరికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన మెజార్టీను మరింతగా పెంచుకుంది. ఏడవ రౌండ్ ముగిసేసరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 60 వేల 826 ఓట్ల ఆధిక్యంలో ఉంది.
Also read: Badvel, Huzurabad Counting live updates: బద్వేలు, హుజూరాబాద్‌లో అధికారపార్టీల ఆధిక్యత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి