Cyclone Alert: బంగాళాఖాతంలో మరో తుపాను, భారీ వర్షాల హెచ్చరిక జారీ

Cyclone Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. క్రమంగా తుపానుగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఫలితంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 30, 2021, 08:51 AM IST
  • బంగాళాఖాతంలో మరో తుపాను హెచ్చరిక
  • నవంబర్ 6న తుపాను, భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసిన ఐఎండీ
  • మూడ్రోజులుగా రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు
Cyclone Alert: బంగాళాఖాతంలో మరో తుపాను, భారీ వర్షాల హెచ్చరిక జారీ

Cyclone Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. క్రమంగా తుపానుగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఫలితంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చు.

నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం(Low Pressure)ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడు, శ్రీలంక తీరప్రాంతం సమీపంలో ఏర్పడిన ఈ అల్పపీడనంతో పాటు బంగాళాఖాతంలో(Bay of Bengal) నవంబర్ 6న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. ఈ అల్పపీడనం క్రమంగా బలపడి తుపానుగా(Cyclone Alert) మారే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అల్పపీడనం 3-4 రోజుల్లో పశ్చిమ దిశగా ప్రయాణించి బలహీనపడేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. ఇక ఉత్తరాంధ్ర తీరంలో ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తన కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 3 రోజుల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు(Heavy Rains) పడవచ్చు. ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(IMD)తెలిపింది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజు 5.5 మిల్లీమీటర్ల వర్షపాతం సగటు నమోదైంది. 

Also read: Badvel Bypoll: బద్వేలు ఉపఎన్నిక నేడే, పోలింగ్ రాత్రి 7 గంటల వరకూ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News