ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం నిధులు విడుదల చేసింది. ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం 318.22 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సర్కారు పెట్టిన ఖర్చులో భాగంగా ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. పీఎంకేఎస్‌వై కింద పోలవరం ప్రాజెక్టుకు నాబార్డ్ నిధులు అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నిధులు కూడా దాని ద్వారానే అందుతాయి.
2018 కల్లా పోలవరం పూర్తి చేస్తామని గత ఎన్నికల్లో కేంద్రం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ ప్రాజెక్టు పనులు నెమ్మదించడంతో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇదే అంశంపై మిత్రపక్షమైన చంద్రబాబు సర్కార్ కూడ కేంద్రంపై గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో ఆగ్రవేశాలను కొంత వరకు చల్లార్చే ప్రక్రియలో భాగంగా కేంద్రం ఈ మేరకు నిధులు విడుదల చేసింది.
పోలవరం కోసం కేంద్రం నిధులు విడుదల