Chandrababu Security: చంద్రబాబు భద్రత విషయంలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని, నమ్మవద్దని జైలు అధికారులు స్పష్టం చేశారు. ఆయన ఆరోగ్యం, భద్రత రెండింటికీ ఢోకా లేదని జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్, ఎస్పీ జగదీష్‌లు మీడీయా సమావేశంలో వెల్లడించారు. చంద్రబాబుకు జైళ్లో పూర్తి భద్రత ఉందని తెలిపారు.
ఏపీ స్కిల్ కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు ఆరోగ్యం, భద్రత విషయంలో వస్తున్న వార్తల్ని జైలు అధికారులు కొట్టివేశారు. చంద్రబాబు రక్షణ విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నామని జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్, జిల్లా ఎస్పీ జగదీశ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. 24 గంటలు సెక్యూరిటీతో పాటు అడిషనల్ సీసీ కెమేరాల మానిటరింగ్ ఉందన్నారు. జైలు చుట్టూ 5 వాచ్ టవర్లు ఉన్నాయన్నారు. ప్రతి గంటకు గార్డ్ సెర్చ్ జరుగుతోందన్నారు.
తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ జగదీష్‌తో మాట్లాడి ప్రత్యేకంగా సెంట్రల్ పోలీస్ లైన్ టీమ్‌తో జైలు చుట్టు పక్కల వాచ్ నడుస్తోందన్నారు. ఈనెల 22వ తేదీన జైలు వాటర్ ట్యాంక్ వైపు ఓ ద్రోన్ తిరిగిందని నార్త్ ఈస్ట్ వాచ్ టవర్ గార్డు నుంచి సమాచారం వచ్చింది. అయితే అది క్లోజ్డ్ జైలు వైపుకు రాలేదు. ద్రోన్ సమాచారం రాగానే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు సమాచారమిచ్చామని జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ తెలిపారు. ఓ రిమాండ్ ఖైదీ జైలులోకి వచ్చేటప్పుడు అతని వద్ద బటన్ కెమేరా గుర్తించామని, వెంటనే స్వాధీనం చేసుకున్నామన్నారు. బటన్ కెమేరా ఎందుకు తీసుకొచ్చాడు, ఎవరి ప్రమేయముందనే విషయంపై విచారణ జరుగుతోందని చెప్పారు.
ఇక జైళ్లో గంజాయి ప్యాకెట్లు విసిరారనేది పూర్తిగా అబద్ధమని చెప్పారు. కుడి కన్నుకు కేటరాక్ట్ ఆపరేషన్ విషయంలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పరీక్షలు చేశారని, కొంతకాలం తరువాతైనా చేయించుకోవచ్చని చెప్పినట్టు తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిస్తున్నామన్నారు. మావోల పేరుతో వచ్చిన లేఖ నకిలీ అని నిర్దారించినట్టు చెప్పారు. అదే సమయంలో చంద్రబాబు రాసినట్టుగా బయటికొచ్చిన లేఖకు జైలు అధికారుల ధృవీకరణ లేదని తేలింది.
Also read: JD Lakshminarayana: ఏపీ సీఎం జగన్‌ను ప్రశంసలతో ముంచెత్తిన సీబీఐ మాజీ అధికారి లక్ష్మీ నారాయణ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook