మూడో శ్వేతపత్రం విడుదల: పేదల సంక్షేమానికి లక్ష కోట్లు ఖర్చుపెట్టామన్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు తన పరిపాలనకు సంబంధించి మూడో శ్వేతపత్రం విడుదల చేశారు.

Last Updated : Dec 26, 2018, 08:18 PM IST
మూడో శ్వేతపత్రం విడుదల: పేదల సంక్షేమానికి లక్ష కోట్లు ఖర్చుపెట్టామన్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు తన పరిపాలనకు సంబంధించి మూడో శ్వేతపత్రం విడుదల చేశారు. సంక్షేమ రంగం, సామాజిక సాధికారికతపై శ్వేత పత్రం విడుదల చేశారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తమ నాలుగర్నరేళ్ల పాలనలో పేదల ఆదుకునేందకు, వారి సంక్షేమానికి లక్ష కోట్లు ఖర్చుపెట్టామని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ  రైతులకు రూ.24 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరాలను చంద్రబాబు వెల్లడించారు..

ముఖ్యాంశాలు: 

* పేదల సంక్షేమానికి నాలుగుర్నరేళ్లలో లక్ష కోట్లు ఖర్చు
* రైతులకు రూ.24 వేల కోట్ల రుణమాఫీ 
* 4.26 లక్షల మందికి చంద్రన్న భీమా పథకం అమలు
* పండగల సందర్భంగా వివిధ వర్గాలకు కానుకలు
*  సంకాంత్రి కానుక, క్రిస్మన్ గిఫ్ట్ , రంజాన్ తోఫా 
*  ప్రతి ఊరిలో పని కల్పించాం

* పేదలకు ఒక్కోక్కరికీ  5 కిలోల రేషన్ బియ్యం పంపిణీ
* అన్నా క్యాంటిన్ల ద్వారా రూ.5 కే భోజనం 
* ఆదరణ పథకం ద్వారా కార్మికుల పనిముట్ల పంపిణీ
* రాష్ట్రంలో 51 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నాం
* చంద్రన్న పెళ్లి కానుక అమలు చేసి పేదలను ఆదుకున్నాం
* ప్రతి ఒక్కరి ఆదాయం పెంచడమే లక్ష్యంగా పని చేశాం

Trending News