అమరావతి: అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమిపై చంద్రబాబు మరోమారు స్పందిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్‌పై ఉన్న సానుభూతే ఆ పార్టీని గెలిపించిందని...ప్రజల కోపం వల్ల టీడీపీ ఓటమి చెందలేదని విశ్లేషించారు.
పార్టీ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని...స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ సత్తా చాటి పార్టీకి పూర్వ వైభవం తీసుకొద్దామని చంద్రబాబు టీడీపీ కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపారు. తదుపరి ఎన్నికల్లో పోరాడేందుకు ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచచారు.
ఈ రోజు ఉండవల్లిలో జరిగిన టీడీఎల్పీ సమావేశంలో కొత్తగా ఎన్నికైన టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబును తమ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.