విజయవాడ నవీకరణకు ఏపీ సీఎం స్కెచ్

       

Last Updated : Oct 15, 2017, 08:59 PM IST
విజయవాడ నవీకరణకు ఏపీ సీఎం స్కెచ్

విజయవాడ నగరానికి ఆవలి ఉన్న మరో 45 గ్రామాలను ఆ జిల్లా నగరపాలకసంస్థలోకి విలీనం చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇటీవలే విజయవాడ, గన్నవరం పరిధిలో తనిఖీలు నిర్వహించిన ఆయన ఈ విషయమై అధికారులతో మాట్లాడారు. ఆ వివరాలు ఇవే 

  • విజయవాడ నగరంలో కొండలపైన, రోడ్డు పక్క ప్రాంతాలలోనూ నివసిస్తున్న దాదాపు 50 వేల కుటుంబాలను ఆదుకోనున్నట్లు, వారికి ఇళ్ళ పట్టాలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. వాంబే కాలనీలో వీరికి ఇళ్ళు కేటాయించాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు
  • అలాగే పాత బస్టాండు దగ్గర ఉన్న సీఎన్జీ డీపోను, పండిట్ నెహ్రు బస్ స్టేషన్‌కు తరలించాలని ఆదేశించారు. 
  • నగరంలో గ్యాస్ పైప్ లైన్ వేయడం కోసం గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులను సంప్రదించాల్సి ఉందని చెప్పారు.
  • విజయవాడకి భవిష్యత్తులో ఎలక్ట్రిక్ బస్సులు తెచ్చే యోచన ప్రభుత్వానికి ఉందని తెలిపారు. 
  • విజయవాడ నగరంలో సుందరీకరణ జరగాలంటే కాల్వల పక్కన చెత్త కనబడకూడదని, రహదారులు పక్కన పూల చెట్లు పెంచే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే జపనీస్ పగోడా రకం చెట్లను పెంచాలని కూడా చెప్పారు.  
  • విజయవాడ కనకదుర్గమ్మ ఆవాసమైన ఇంద్రకీలాద్రిపై ఎరుపు, పసుపు రంగు పుష్పవాటికలను ఏర్పాటు చేయాలని, ఇటువంటి కొత్త ఆలోచనల వల్లే పర్యాటకంగా మనం ముందుకు వెళ్లగలమని , ప్రస్తుతం పుష్పవాటికల నిర్మాణ బాధ్యతను అర్మన్ గ్రీనరీ ప్రాజెక్టు అధికారులకు ఇస్తున్నామని అన్నారు. 
  • దుర్గమ్మ గుడి వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులకు తెలిపారు. 

Trending News