AP POLITICS: కాకినాడలో వైసీపీకి బిగ్‌ షాక్‌.. మాజీ ఎమ్మెల్యే దుకాణం బంద్

Cm chandra babu: వైసీపీ నేతలకు కూటమి సర్కార్‌ ఉక్కిరిబిక్కిరి చేస్తోందా..! గత వైసీపీ సర్కార్‌లో రెచ్చిపోయిన లీడర్లకు చుక్కలు చూపిస్తోందా..! ఇప్పుడు కూటమి సర్కార్‌ ఆ నేతను టార్గెట్‌ చేసిందా..! గతంలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌పై వ్యక్తిగత దూషణలకు దిగిన ఆయనకు చెక్‌ పెట్టిందా..! సర్కార్‌ చర్యతో ఆయన పరేషాన్‌ అవుతున్నారా..!

Written by - G Shekhar | Last Updated : Nov 14, 2024, 06:39 PM IST
AP POLITICS: కాకినాడలో వైసీపీకి బిగ్‌ షాక్‌.. మాజీ ఎమ్మెల్యే దుకాణం బంద్

Cm chandra babu: కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డికి కష్టాలు మొదలైనట్టు తెలుస్తోంది. గత వైసీపీ పాలనలో చెలరేగిపోయిన ఆయనపై కూటమి సర్కార్‌ రివేంజ్ తీసుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. గత వైసీపీ సర్కార్‌ హాయాంలో జరిగిన అవినీతిపై కూటమి సర్కార్‌ లెక్కలు తీస్తోందట. వైసీపీ ప్రభుత్వ హయాంలో ద్వారంపూడి కాకినాడలో కీలకంగా వ్యవహరించారు. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను ఇరుకున పెట్టారు. కానీ ఐదేళ్లు తిరిగేలోపే రాష్ట్రంలో సర్కార్‌ మారడంతో ద్వారంపూడికి చెక్‌ పెట్టేందుకు కూటమి సర్కార్ పావులు కదుపుతున్నట్టు ప్రస్తుత పరిస్థితులు చూస్తేనే అర్థమైపోతోందని కాకినాడ ప్రజలు అంటున్నారు.  

Also read: KTR: లగచర్లపై రేవంత్‌ కుట్ర బట్టబయలు.. దాన్ని కవర్‌ చేసుకునేందుకు తంటాలు

ఇక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రాజకీయ ఆరంగ్రేట్రం కాంగ్రెస్‌ పార్టీలో మొదలైంది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత వైసీపీలో చేరిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి కాకినాడ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ సర్కార్‌ అధికారంలోకి రావడంతో ద్వారంపూడికి తిరుగులేకుండా పోయింది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సీఎం జగన్‌ ప్రతిపక్ష పార్టీలను తిట్టించడంలో సక్సెస్‌ అయ్యారు. అందుకేనేమో ఆయన చాలాసార్లు ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌పై అనేకసార్లు నోరు పారేసుకున్నారు. ఒకనొక సమయంలో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబును అవమానించిన తీరుతో యావత్ సమాజం నివ్వెరపోయింది. ఇక జనసేన అధినేత పవన్‌కు సవాళ్లు విసిరి సంచలనం రేపారు. కానీ ఐదేళ్లు గడిచే సరికి పరిస్థితులు మొత్తం తలకిందులయ్యాయి. తాజాగా రాష్ట్రంలో కూటమి సర్కార్‌ అధికారంలోకి రావడంతో ద్వారంపూడికి చెక్‌ పెట్టేందుకు ప్రయత్నిస్తోందని కాకినాడలో జోరుగా ప్రచారం జరుగుతోంది..

తాజాగా ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డికి చెక్‌ పెట్టింది. ఆయన సోదరుడు కాకినాడలో నడిపిస్తున్న రొయ్యాల ప్రాసెసింగ్‌ యూనిట్‌పై సర్కార్‌ చర్యలకు దిగింది. గత వైసీపీ సర్కార్‌ పాలనలో అనేక సార్లు రొయ్యాల యూనిట్‌లో ప్రమాదం జరిగింది. ఆయినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ రాష్ట్రంలో కూటమి సర్కార్‌ అధికారంలోకి రాగానే ద్వారంపూడిపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అందుకేనేమో ఇటీవల కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన రొయ్యాల యూనిట్‌ గురించి ప్రస్తావించారు. అంతేకాకుండా ఆ వెంటనే ఫొల్యూషన్‌ కంట్రోల్ బోర్డు అధికారులను ఆదేశించారు. కానీ రొయ్యాల యూనిట్‌ పై అధికారులకు చర్యలకు దిగలేదు. దాంతో అధికారులను పవన్‌కల్యాణ్‌ క్లాస్‌ పీకినట్టు ప్రచారం సైతం జరిగింది. పవన్ రియాక్షన్‌తో మరోసారి అధికారులు యూనిట్‌లో తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో గ్రీన్‌ బెల్ట్‌ పెంచడం లేదు. ఫ్యాక్టరీ నుంచి  కెమికల్స్ కలిసిన వ్యర్థాలను వదిలేస్తున్నారని గుర్తించారు. దాంతో ప్యాక్టరీని సీజ్‌ చేశారు. అయితే సర్కార్‌ చర్యతో ద్వారంపూడి దిమ్మతిరిగే షాక్ తగిలిందనే ప్రచారం జరుగుతోంది.

మొత్తంగా ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి ఇతర వ్యాపారాలపైన కూటమి సర్కార్ ఫోకస్‌ చేసినట్టు తెలుస్తోంది. ద్వారంపూడికి అనేక వ్యాపారాలు ఉన్నాయి. అయితే ఈ వ్యాపార లావాదేవీలపైన దాడులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాదు ద్వారంపూడిని కటాకటాల వెనక్కి నెట్టడమే కూటమి సర్కార్‌ ఆలోచనగా ఉందని కూటమి పార్టీలే గుసగుసలాడుకుంటున్నారట.. చూడాలి మరి ద్వారంపూడి విషయంలో సర్కార్‌ చర్యలు ఎలా ఉండబోతున్నాయో..!

Also Read: Naga Chaitanya - Sobhita: నాగచైతన్య-శోభితల పెళ్లిపై నాగార్జున యూటర్న్‌..?.. బాంబు పేల్చిన మరో సిద్ధాంతి.. అసలేం జరిగిందంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x