పెదగార్లపాడు ఘటనపై సీఎం సీరియస్.. డీజీపికి ఆదేశాలు

పెదగార్లపాడు ఘటనపై సీఎం సీరియస్.. డీజీపికి ఆదేశాలు 

Last Updated : Oct 26, 2019, 05:45 PM IST
పెదగార్లపాడు ఘటనపై సీఎం సీరియస్.. డీజీపికి ఆదేశాలు

గుంటూరు: జిల్లాలోని దాచేపల్లి మండలం పెదగార్లపాడులో బాలికపై అత్యాచారయత్నం ఘటన తీవ్ర కలకలంరేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను నిరసిస్తూ తీవ్రస్థాయిలో నిరసనలు జరిగాయి. మరోవైపు బాలికపై అత్యాచారయత్నం ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన సీఎం వైఎస్ జగన్.. ఈ అరాచకాన్ని అంతే తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఇకపై ఎక్కడా ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని.. లైంగిక దాడులకు పాల్పడే నిందితులు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని వెంటనే డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు.

Trending News