AP: కరోనా టెస్ట్ ఇక మరింత చవకగా..

కరోనా నిర్ధారణ పరీక్షలపై ( Covid tests ) ఏపీ ప్రభుత్వం ( Ap government ) మరింత దృష్టి సారిస్తోంది. పరీక్షల్ని అందరికీ అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుుకుంటోంది. ప్రైవేట్ గా చేస్తున్న పరీక్షల ధరల్ని మరింతగా తగ్గించింది.

Last Updated : Aug 27, 2020, 05:48 PM IST
AP: కరోనా టెస్ట్ ఇక మరింత చవకగా..

కరోనా నిర్ధారణ పరీక్షలపై ( Covid tests ) ఏపీ ప్రభుత్వం ( Ap government ) మరింత దృష్టి సారిస్తోంది. పరీక్షల్ని అందరికీ అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుుకుంటోంది. ప్రైవేట్ గా చేస్తున్న పరీక్షల ధరల్ని మరింతగా తగ్గించింది.

కరోనా వైరస్( Corona virus ) పై ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే దేశంలోనే అత్యధికంగా పరీక్షలు చేస్తున్న రాష్ట్రంగా పేరు గాంచింది. రోజుకు దాదాపు 50-60 వేల పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక ప్రైవేట్ గా చేస్తున్న కరోనా నిర్దారణ పరీక్షలపై కూడా దృష్టి పెట్టింది. వాస్తవానికి గతంలోనే ఓసారి ప్రైవేట్ గా చేసే పరీక్షల్నితగ్గించింది. ఇప్పుడు మరోసారి ప్రైవేట్ టెస్ట్ దరల్ని ( New price list for corona test ) నిర్ణయించింది. దీని ప్రకారం ప్రభుత్వం పంపిన శాంపిల్స్ టెస్ట్ కు ఇప్పటివరకూ 2 వేల 4 వందలు వసూలు చేసేవారు. ఇకపై 16 వందలు మాత్రమే ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ గా ల్యాబ్స్ లో చేస్తున్న టెస్ట్ ను 2 వేల 9 వందల రూపాయలకు బదులు 19 వందలకే చేయాలి. ఈ మేరకు కొత్త ధరల్ని నిర్ణయిస్తూ ప్రభుత్వం మార్గదర్శకాల్ని జారీ చేసింది. టెస్ట్ కిట్లు పెద్దఎత్తున అందుబాటులో రావడంతో ధర తగ్గిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. తగ్గిన ధరల ద్వారా కలిగే ప్రయోజనాల్ని ప్రజలకే అందించేలా నిర్ణయం తీసుకన్నట్టు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. Also read: AP: అమరావతి రైతులకు వార్షిక కౌలు, పెన్షన్ విడుదల చేసిన ప్రభుత్వం

Trending News