AP: అమరావతి రైతులకు వార్షిక కౌలు, పెన్షన్ విడుదల చేసిన ప్రభుత్వం

అమరావతి రైతులకు ( Amaravati farmers ) అందాల్సినవన్నీ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఒప్పందం ప్రకారం ఆ రైతులకు ఇవ్వాల్సిన వార్షిక కౌలు, పెన్షన్ ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించినా..రైతుల ప్రయోజనాలు ఆగకపోవడం విశేషం.

Last Updated : Aug 27, 2020, 01:36 PM IST
AP: అమరావతి రైతులకు వార్షిక కౌలు, పెన్షన్ విడుదల చేసిన ప్రభుత్వం

అమరావతి రైతులకు ( Amaravati farmers ) అందాల్సినవన్నీ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఒప్పందం ప్రకారం ఆ రైతులకు ఇవ్వాల్సిన వార్షిక కౌలు, పెన్షన్ ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించినా..రైతుల ప్రయోజనాలు ఆగకపోవడం విశేషం.

అమరావతి రైతుల విషయంలో ఏపీ ప్రభుత్వం ( Ap government ) తీసుకున్న కీలక నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. గత ప్రభుత్వంతో రాజధాని విషయమై ఈ ప్రాంత రైతులు చేసుకున్న ఒప్పందం ప్రకారం వార్షిక కౌలుతో పాటు నెలకు పెన్షన్ ను చెల్లించాల్సి ఉంది. అయితే కొత్తగా అధికారంలో వచ్చిన వైసీపీ ప్రభుత్వం ( ycp government ) మూడు రాజధానుల అంశాన్ని ( three capital issue ) తెరపై తీసుకొచ్చింది. గవర్నర్ మూడు రాజధానుల బిల్లును ఆమోదించారు కూడా. కానీ అమరావతి రైతులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన దర్నాలు చేపట్టారు. హైకోర్టును ఆశ్రయించి స్టేటస్ కో పొందారు. అయినా ఏపీ ప్రభుత్వం మాత్రం ఆ రైతులకు అందాల్సిన ప్రయోజనాల్ని అందేలా చేస్తోంది. ఒప్పందం ప్రకారం వార్షిక కౌలు, పెన్షన్ ను ప్రభుత్వం విడుదల చేసి..నేరుగా రైతుల ఖాతాల్లో వేస్తున్నట్టు ప్రకటించింది.  వార్షిక కౌలు కింద 158 కోట్ల రూపాయలు, పెన్షన్ కింద 9 కోట్ల 73 లక్షల్ని జమ చేస్తున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. వాస్తవానికి పెన్షన్ గత ప్రభుత్వమైతే రైతుకు 2 వేల 5 వందల రూపాయలు చెల్లించేది. కానీ వైసీపీ ప్రభుత్వం ఆ పెన్షన్ ను పెంచుతానని ఇచ్చిన హామీ మేరకు 5 వేలు చెల్లిస్తోంది. పెన్షన్ పెంపు కారణంగా రాష్ట్ర ఖజానాపై నెలకు అదనంగా 5.3 కోట్ల భారం పడనుంది. Also read: Global Times Survey: ప్రధాని నరేంద్ర మోదీకే జై కొట్టిన చైనా!

Trending News