CoronaVirus Cases In AP | ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ప్రభావం తీవ్రంగానే ఉంది. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,322 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఇందులో రాష్ట్రంలో ఉన్నవారికి 1263 మందికి కరోనా సోకగా, మిగతా 59 కేసులు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో నిర్ధారించారు. తాజా కేసులతో కలిపితే ఏపీలో కరోనా కేసులు (AP CoronaVirus Cases) 20,019కు చేరుకున్నాయి. ఒక్కరోజులో 24,248 కరోనా కేసులు.. అదొక్కటే ఊరట
రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులకు గాను 8,920 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 10,860 కోవిడ్19 యాక్టీవ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో 7 మంది వ్యక్తులు కరోనాతో మరణించారు. ఇప్పటివరకూ ఏపీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 239కి చేరింది. క్యారెట్ తింటే ఈ 10 ప్రయోజనాలు తెలుసా!
తాజాగా కర్నూలు శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు, అనంతపురంలో ఒక్కరు, చిత్తూరులో ఒక్కరు, కృష్ణా జిల్లాలో ఒక్కరు, గుంటూరులో ఒక్కరు, విశాఖ జిల్లాలో ఒక్కరు చొప్పున కరోనా సోకి చనిపోయారు. ఏపీలో గడిచిన 24 గంటల్లో 16,712 శాంపిల్స్ పరీక్షించగా మొత్తం 1,322 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా నిర్ధారించారు. అదే సమయంలో 424 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఫేక్ కరోనా రిపోర్ట్స్ కలకలం.. హాస్పిటల్ సీజ్
నేటి వరకు రాష్ట్రంలో మొత్తం 10,33,852 శాంపిల్స్ పరీక్షించగా ఏపీ నుంచి 17,365 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 2,235 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో 419 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ఈ వివరాలు వెల్లడించింది. ఈ మేరకు జులై 6న సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos
CoronaVirus Cases: ఏపీలో 20వేలు దాటిన కరోనా కేసులు