కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్ సునీల్ నరైన్ బౌలింగ్ శైలి ( KKR's bowler Sunil Narine's bowling ) అనుమానాస్పదంగా ఉందంటూ ఆన్‌ఫీల్డ్ అంపైర్స్ బీసీసీఐకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మ్యాచ్‌లో కరీబియన్ ఆటగాడి బౌలింగ్ సరిగ్గా లేదని ఆరోపణలు రావడంపై సదరు బౌలర్ ప్రాతినిథ్యం వహిస్తున్న కోల్‌కతా నైట్ రైడర్స్ ( Kolkata Knight Riders ) స్పందించింది. నేడు సోమవారం షార్జా స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( Rcb vs KKR match ) జట్టుతో పోటీపడనున్న నేపథ్యంలో ఈ వివాదంపై స్పందించిన కోల్‌కతా నైట్ రైడర్స్.. సునీలై నరైన్‌పై అటువంటి ఆరోపణలు రావడం అతడికే కాదు.. తమకు కూడా ఆశ్చర్యం కలిగించిందని వాపోయింది. 2012 ఐపిల్ నుండి ఇప్పటివరకు సునీల్ నరైన్ 115 ఐపిఎల్ మ్యాచ్‌లు ఆడాడాని.. అందులోనూ చివరి ఐదేళ్లలోనే 68 మ్యాచ్‌లు ఆడాడని కోల్‌కతా నైట్ రైడర్స్ పేర్కొంది. అటువంటి ఆటగాడిపై అభియోగాలు రావడం ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొంటూ కోల్‌కతా ఫ్రాంచైజీ ఓ ప్రకటన విడుదల చేసింది. Also read : IPL 2020లో తక్కువ రన్స్ ఇచ్చిన బెస్ట్ బౌలర్ ఎవరో తెలుసా ?
ఐతే, ఏది ఏమైనా సునిల్ నరైన్ బౌలింగ్ యాక్షన్‌ని ( Sunil Narine's bowling action ) సమీక్షించాలనే IPL 2020 నిర్వాహకుల నిర్ణయాన్ని తాము కూడా గౌరవిస్తున్నామని, ఈ విషయంలో ఐపిఎల్ నిర్వాహకులతో కలిసి పనిచేస్తున్నామని కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రకటించింది. ఈ వివాదం వీలైనంత త్వరగా సమసిపోతుందని ఆశిస్తున్నామని, ఐపిఎల్ నుండి అందుతున్న సహకారాన్ని అభినందించకుండా ఉండలేమని కోల్‌కతా టీమ్ స్పష్టంచేసింది.
కోల్‌కతా నైట రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో క్లిష్టమైన 18వ ఓవర్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఛేజింగ్‌లో ఉండి విజయానికి సమీపంగా ఉన్న సమయంలో బౌలింగ్‌కి వచ్చిన సునీల్ నరైన్.. ఆ ఓవర్‌లో కేవలం 2 పరుగులే ఇచ్చి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐతే మ్యాచ్ అనంతరం ఈ మ్యాచ్‌లో సునీల్ నరైన్ బౌలింగ్‌పై ఆన్‌ఫీల్డ్ అంపైర్లు ఫిర్యాదు చేయడంపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విస్తుపోయింది. Also read : IPL 2020: సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదు
ఇదిలావుంటే, నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ( Royal Challengers Bangalore ) జట్టుతో జరగనున్న మ్యాచ్‌లో సునీల్ నరైన్ బౌలింగ్‌పై ఎలాంటి కామెంట్స్ వినిపించనున్నాయో వేచిచూడాల్సిందే మరి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe