AP: భారీగా తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ దాదాపుగా అదుపులోకి వచ్చినట్లేనా. గణాంకాలు పరిశీలిస్తే అవుననే తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు భారీ సంఖ్యలో నమోదైన కేసులు ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో కేవలం 3 వేల 224 కేసులు మాత్రమే వెలుగుచూడటం ఇందుకు ఉదాహరణ.

Last Updated : Oct 12, 2020, 08:07 PM IST
AP: భారీగా తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌ ( Andhra pradesh ) లో కరోనా వైరస్ ( Corona virus ) దాదాపుగా అదుపులోకి వచ్చినట్లేనా. గణాంకాలు పరిశీలిస్తే అవుననే తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు భారీ సంఖ్యలో నమోదైన కేసులు ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో కేవలం 3 వేల 224 కేసులు మాత్రమే వెలుగుచూడటం ఇందుకు ఉదాహరణ.

ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు ( Covid19 Tests ) జరుగుతున్నట్టే..కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతూ వచ్చింది. ఓ దశలో దేశంలో రెండోస్థానాన్ని ఆక్రమించింది ఆంధ్రప్రదేశ్. రోజుకు సుమారుగా 70-75 వేల కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతుండగా..పాజిటివ్ కేసులు 10 వేల వరకూ బయటపడుతుండేవి. ఇప్పుడు గత కొద్దిరోజులుగా 4-5 వేల కేసులు మాత్రమే వెలుగుచూస్తున్నాయి. 

గత 24 గంటల్లో ఏపీలో 61 వేల పరీక్షలు నిర్వహించగా..కేవలం 3 వేల 224 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 7 లక్షల 58 వేల 951కు చేరింది. అటు రాష్ట్రంలో మొత్తం కరోనా నిర్ధారణ పరీక్షలు 7 లక్షల 56 వేలు దాటాయి. గత కొద్దిరోజులుగా కరోనా వైరస్ కేసులు తగ్గుతుండటం, మొత్తం సంఖ్య పది వేల నుంచి 5 వేలలోపుకు చేరుకోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.  

దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ కోవిడ్ 19 కేసులు ( Covid19 cases ) తగ్గిపోతున్నాయి. అయితే ఉభయ గోదావరి జిల్లాల్లో కొవిడ్ తీవ్రత గతంలో కంటే తగ్గినప్పటికీ కొత్తగా నమోదయ్యే కేసుల్లో ఎక్కువగా ఇక్కడ్నించే ఉంటున్నాయి. ఈ జిల్లాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉండటమే కారణమని తెలుస్తోంది. తాజాగా తూర్పు గోదావరి జిల్లా నుంచి  547 కేసులు , పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 489 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. Also read: AP High court: అమరావతిపై విచారణ నవంబర్ 2కు వాయిదా

Trending News