నేటి నుంచే డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ.. ఇదిగో సమగ్ర సమాచారం

డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం

Last Updated : Nov 1, 2018, 02:48 PM IST
నేటి నుంచే డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ.. ఇదిగో సమగ్ర సమాచారం

ఏపీలో టీచర్ పోస్టుల భర్తీ కోసం అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. టీచర్ పోస్టుల భర్తీ కోసం పాఠశాల విద్యాశాఖ చేపట్టనున్న డీఎస్సీ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచే ప్రారంభం కానుంది. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ .. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ప్రకటించింది. దరఖాస్తు ప్రక్రియతోపాటు పరీక్ష నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలు, సిలబస్ విధానం, ముఖ్యమైన తేదీలు, షెడ్యూల్ వంటి ముఖ్యమైన సమాచారాన్ని సైతం తమ అధికారిక వెబ్‌సైట్ www.cse.ap.gov.in ద్వారా అభ్యర్థులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. జిల్లాల వారీగా పోస్టులు, మీడియం, కమ్యూనిటీ వారీగా రోస్టర్‌ను అందులో సవివరంగా పేర్కొన్నారు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే.. అర్హత, కేటగిరీకి తగిన టీచర్‌ పోస్టు ఖాళీగా ఉంటేనే సదరు జిల్లాకు దరఖాస్తుచేసుకునే వీలు ఉంది. అలా కాకుండా ఒకవేళ ఎవరైనా ఒక అభ్యర్థికి తగిన పోస్టులు ఖాళీలు లేనట్టయితే, ఆన్‌లైన్‌లో అసలు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవకుండా కమిషనరేట్ ఏర్పాట్లు చేసింది. అందుకు ప్రత్యామ్నాయంగా ఇతర జిల్లాల్లోంచి పోస్టులను ఎంచుకోవాల్సి ఉంటుందని విద్యాశాఖ సూచించింది.  

కేటగిరీల వారీగా పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌ హెల్ప్‌లైన్‌ నెంబర్లు: 
ఏపీ మోడల్‌ స్కూల్స్‌-9603587533, 
బీసీ వెల్ఫేర్‌-9603576833, 
ఏపీఆర్‌ఈఐ సొసైటీ-9603570433, 
గవర్నమెంట్‌ / జడ్పీ / ఎంపీపీ / మున్సిపల్‌, ట్రైబల్‌-9603578533, 9505619127, 9505853627. 
సాంకేతిక సమస్యల పరిష్కారానికి 9121148061, 9121148062
 
డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు:

>    నవంబరు 1 నుంచి 15 వరకు ఫీజు చెల్లింపు ప్రక్రియ.
>    1 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ.
>    1 నుంచి 12 వరకు హెల్ప్‌ డెస్క్‌ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
>    17 నుంచి ఆన్‌లైన్‌లో మాక్‌ టెస్టు (నమూనా పరీక్షలు)ల నిర్వహణ.
>    19 నుంచి 24 వరకు పరీక్షా కేంద్రాల ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
>    29 నుంచి హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
>    డిసెంబరు 6, 10 తేదీల్లో స్కూల్‌ అసిస్టెంట్స్ ‌(నాన్‌ లాంగ్వేజెస్‌) రాతపరీక్షల నిర్వహణ.
>    11న స్కూల్‌ అసిస్టెంట్స్ ‌(లాంగ్వేజెస్‌) రాతపరీక్షల నిర్వహణ.
>    12, 13 తేదీల్లో పీజీ టీచర్స్‌ రాతపరీక్ష నిర్వహణ.
>    14, 26 తేదీల్లో పీజీ టీచర్స్‌, ప్రధానోపాధ్యాయుల రాతపరీక్షలు.
>    17న పీఈటీ, మ్యూజిక్‌, క్రాఫ్ట్‌, ఆర్ట్‌ అండ్‌ డ్రాయింగ్‌ పరీక్షల  నిర్వహణ.
>    27న లాంగ్వేజ్‌ పండిట్స్‌ పరీక్షల నిర్వహణ.
>    28 నుంచి 2019 జనవరి 2 వరకు ఎస్జీటీ పరీక్షల నిర్వహణ.

 

Trending News