AP Elections 2024: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక దేశంలో సాధారణ ఎన్నికలు, ఏపీ అసెంబ్లీకలపై చర్చ ప్రారంభమైంది. ఈసారి ఎన్నికలు అనుకున్న సమయం కంటే నెలన్నర ముందే జరగనున్నాయని తెలుస్తోంది. అటు ఎన్నికల సంఘం సైతం ఈ మేరకు సిద్ధమైందని సమాచారం. ఏపీ ప్రభుత్వం కూడా అందుకు తగ్గ ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.
దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో అధికారం కైవసం చేసుకుని ఊపు మీదున్న బీజేపీ అదే కొనసాగించాలని చూస్తోంది. ప్రతిపక్షాలకు కోలుకునేందుకు సమయం ఇవ్వకూడదని భావిస్తోంది. మరోవైపు ప్రతిసారీ ఎన్నికల ప్రక్రియ మే వరకూ కొనసాగుతుండటంతో వేసవి ప్రభావం ఓటింగ్‌పై పడుతోందని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఎందుకంటే ఇటీవల శీతాకాలంలో జరిగిన ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా ఉండటం ఇందుకు కారణంగా విశ్లేషిస్తోంది. ముఖ్యంగా ఏప్రిల్ చివరి వారంలో మే నెలలో దక్షిణాదిన ఎండలు తారాస్థాయికి చేరుతుంటాయి. ఈసారి కూడా వేసవి ప్రభావం తీవ్రంగా ఉంటుందనే అంచనాల నేపధ్యంలో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సహా సాధారణ ఎన్నికల్ని నెలన్నర ముందుకు జరిపే ఆలోచనలో ఎన్నికల సంఘం ఉంది.
అంటే మార్చ్-ఏప్రిల్ నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు యోచిస్తోంది. గతంలో అంటే 2019లో జరిగినట్టు 8 విడతల్లో కాకుండా గరిష్టంగా 4 దశల్లో పూర్తి చేయాలనే ఆలోచన కూడా ఉంది. అంటే ఈ లెక్కన ఎన్నికల నోటిఫికేషన్ బడ్జెట్ తరువాత ఫిబ్రవరి మొదటి వారాంతంలో విడుదలయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. 2019లో ఎన్నికల నోటిఫికేషన్ మార్చ్ 10వ తేదీన విడుదలైంది. ఈసారి నెల రోజులు ముందుగా ఫిబ్రవరి 7-10 తేదీల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావచ్చని తెలుస్తోంది.
ఇటు ఏపీలో కూడా ఇందుకు సంబంధించిన సమాచారం ఉండటంతో ప్రభుత్వం సన్నద్ధమౌతోంది. రిటర్నింగ్ అధికార్ల నియామకం, ఈవీఎంలను నియోజకవర్గాలకు చేర్చే ప్రక్రియ పూర్తవుతోంది. ఓటర్ల జాబితాను కూడా అప్‌డేట్ చేస్తున్నారు. ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని ఏపీలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షల్ని ఈసారి త్వరగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది మార్చ్ 15 నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకూ ఇంటర్ పరీక్షలు జరిగితే, పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 18కు వరకూ జరిగాయి. ఈసారి మాత్రం ఇంటర్ పరీక్షల్ని మార్చ్ మొదటి వారంలో ప్రారంభించేందుకు, పదవ తరగతి పరీక్షల్ని మార్చ్ 20 నుంచి నెలాఖరు వరకూ పూర్తి చేసేందుకు ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ కళాశాలకు, విద్యాలయాలకు ఇందుకు సంబంధించిన సమాచారం చేరుతోంది.
Also read: Article 370 Verdict: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం సంచలన తీర్పు, ఏం చెప్పిందంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook