Kadapa Politics: కడపలో సీఎం వర్సెస్ ఆది!

CM Ramesh: ఉమ్మడి కడప జిల్లాలో కమలం పార్టీ నేతలు కత్తులు దూస్తున్నారా..! ఆ నియోజకవర్గంలో ఎంపీ వర్సెస్‌ ఎమ్మెల్యేగా సీన్‌ మారిపోయిందా..! ఆ ఎమ్మెల్యే తీరుతో ఎంపీ వర్గం తీవ్రంగా రగిలిపోతోందా..! ఆ విషయంలో తగ్గాలంటూ సీఎం చంద్రబాబు బుజ్జగించినా.. ఎమ్మెల్యే అనుచరులు వెనక్కి తగ్గడం లేదా..! ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు ఎంపీకి మధ్య జరుగుతున్న గొడవేంటి..! ఆ గొడవకు కారణం ఆ ప్రాజెక్టేనా?

Written by - G Shekhar | Last Updated : Nov 30, 2024, 07:08 PM IST
Kadapa Politics: కడపలో సీఎం వర్సెస్ ఆది!

Adhi Narayana Reddy: గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో కమలం పార్టీ తొలిసారి వికసించింది. ఆ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.  జమ్మలమడుగు నుంచి బీజేపీ నేత ఆది నారాయణ రెడ్డి భారీ విజయం సాధించారు. ఇప్పుడు కూటమి సర్కార్‌లో ప్రభుత్వ విప్‌గా ఆయన కొనసాగుతున్నారు.. ప్రస్తుతం ఆదినారాయణ రెడ్డి అనుచరులు జమ్మలమడుగులో చేస్తున్న రచ్చ హాట్‌ టాపిక్‌ అయ్యింది. అయితే జమ్మలమడుగులో ఆది నారాయణ రెడ్డి అనుచరులు చేస్తున్న హంగామా సొంత పార్టీ ఎంపీ సీఎం రమేష్‌ నాయుడు పైనే కావడంతో ఈ వివాదం ఎక్కడివరకు వెళ్తుందోనని సొంత పార్టీ లీడర్లే పరేషాన్ అవుతున్నట్టు సమాచారం..

ఇక ఇదే జిల్లాకు చెందిన సీఎం రమేష్‌.. గతంలో తెలుగుదేశం పార్టీలో కీలకంగా కొనసాగారు. 2019 ఎన్నికలకు తర్వాత జగన్ ప్రభుత్వం రాగానే ఆయన కమలం కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగానూ కంటిన్యూ అయ్యారు. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలోకి రావడంతో జమ్మలమడుగులో భారీ విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ కాంట్రాక్ట్‌ను గుజరాత్‌కు చెందిన అదానీ కంపెనీ దక్కించుకుంది. ప్రస్తుతం జమ్మలమడుగులో విద్యుత్‌ ప్లాంట్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అయితే సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ సంస్థకు అదానీ కంపెనీ నుండి ఓ సబ్‌ కాంట్రాక్ట్‌ సైతం ఇచ్చింది. దీని విలువ దాదాపు 2000 కోట్లు అని చెబుతున్నారు. అయితే తన ఇలాకాలో చేపడుతున్న పనుల్లో తనను పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే తీవ్ర ఆవేదనకు గురవుతున్నట్టు తెలిసింది.

తాజాగా ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి అనుచరులు.. రిత్విక్ సంస్థపై దాడి చేయడం హాట్ టాపిక్‌ అయ్యింది. రిత్విక్ సంస్థపై దాడికి దిగిన అనుచరులు పనులు జరుగుతున్న ప్రాంతంలో విధ్వంసం సృష్టించారు. అయితే సీఎం చంద్రబాబు దృష్టికి ధ్వసం జరిగిన విషయాన్ని సీఎం రమేష్‌ తీసుకెళ్లారట. దాంతో ఆది నారాయణ రెడ్డికి చంద్రబాబు బుజ్జగించినట్టు సమాచారం. కానీ ఈ విషయంలో ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి అనుచరులు మాత్రం ఎక్కడా తగ్గడం లేదట. మా ఇలాకాలో ఎంపీ సీఎం రమేష్ పెత్తనం ఏంటని ప్రశ్నిస్తున్నారట.. తమకు దక్కాల్సిన వాటా దక్కాకే.. మిగతా పనులు చేస్కోండని వార్నింగ్‌లు ఇస్తున్నట్టు తెలిసింది.

మరోవైపు ఈ వివాదం నడుస్తుండగానే.. మరో వివాదంలో ఇరుక్కున్నారు ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి. జమ్మలమడుగులోని RTPP నుంచి ఫ్లైయాస్ పౌడర్ తాడిపత్రికి తరలించే విషయంలో జేసీ బ్రదర్స్‌తో గొడవకు దిగడం హాట్‌ టాపిక్‌ అయ్యింది. దాంతో జమ్మలమడుగులో మరోసారి ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. అయితే తాడిపత్రి నుంచి జేసీ వర్గీయులు మళ్లీ వస్తున్నారన్న సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు.. ముందు జాగ్రత్తగా భారీగా బలగాలను మోహరించారు. అటు అనంత పురం, కడప జిల్లా బోర్డర్ అయిన కొండాపురం మండలంలో చెక్ ఫోస్ట్ ఏర్పాటు చేసినట్టు సమాచారం. మొత్తంగా అటు సొంత పార్టీ లీడర్‌, మరోవైపు టీడీపీ లీడర్‌ను వరుసబెట్టి అడ్డుకుంటున్న ఆది నారాయణ రెడ్డి అనుచరులు ఇకమీదట ఏం చేయబోతున్నారు అనేది కూడా చర్చనీయాశంగా మారింది.

Also Read:  Tirumala: తిరుమలలో మళ్లీ అన్యమత ఆనవాళ్లు.. విజిలెన్స్ వైఫల్యంతో తీవ్ర దుమారం

Also Read: Pawan Kalyan Serious On TDP: టీడీపీ నేతలను షేక్ చేస్తున్న పవన్ కళ్యాణ్, జనసేనాని తీరుతో టీడీపీ షాక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News