Pawan Kalyan Serious On TDP: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన మార్క్ పాలన చూపిస్తున్నారు. ఒక వైపు ఏపీ అభివృద్ధి కోసం కేంద్రంతో నిరంతరం చర్చలు జరుపుతున్న పవన్ మరోవైపు ఏపీలో జరుగుతున్న అక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. కూటమి సర్కార్ లో ఎక్కడైనా అవినీతి,అక్రమాలు జరిగితే మాత్రం చూస్తూ ఊరుకోనని వార్నిగ్ ఇస్తున్నారు. అక్రమాలకు పాల్పడిన వాళ్లు కూటమి నేతలైనా వదిలేదనే సందేశం పంపుతున్నారు. తాజాగా పవన్ కాకినాడ పర్యటనలో భాగంగా రేషన్ బియ్యం అక్రమాలపై స్వయంగా రంగంలోకి దిగారు. పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యం అక్రమంగా విదేశాలకు తరులుతుండడంపై పవన్ సీరియస్ అయ్యారు.గత కొద్ది రోజులుగా రేషన్ అక్రమాలపై పవన్ కు అనేక ఫిర్యాదులు అందాయి. అసలు కాకినాడ పోర్టులో ఏం జరుగుతుందో స్వయంగా తానే పరిశీలించాలనకున్నాడు పవన్.
ఢిల్లీ నుంచి వచ్చీ రాగానే కాకినాడ పోర్టుకు చేరకున్న పవన్ రేషన్ అక్రమ బాగోతాన్ని బయటపెట్టాడు. ఇంత వరకూ బాగానే బియ్యం ఇలా అక్రమంగా రవాణా కావడంపై అధికారులు నేతలపై పవన్ ఫైర్ అయ్యారు. మీకు తెలియకుండా ఇలా బియ్యం వెళుతుందా అని అధికారులను,నేతలన నిలదీశారు. అంతటితో ఆగని పవన్ పక్కనే ఉన్న కాకినాడ టీడీపీ ఎమ్మెల్యేపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.మీరు ఇలాంటి అక్రమదారులతో కాంప్రమైజ్ ఐతే ఎలా అని నిలదీశారు. గత ప్రభుత్వంపై మనం విమర్శలు చేసి ఇప్పుడు మనం అదే తప్పును చేస్తే ఎలా అని కడిగి పారేశారు. దీంతో అక్కడ ఉన్న వారంతా ఒక్క సారిగా షాక్ అయ్యారు. పవన్ ఎమ్మెల్యే కొండ బాబుపై సీరియస్ అవడడంపై ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చే జరుగుతుంది.
ఇది ఇలా ఉంటే కొద్ది రోజుల క్రితం కూడా హోం మంత్రి అనితపై ఇదే విధంగా బహిరంగంగానే పవన్ సీరియస్ అయ్యారు. ఏపీలో వరుస రేప్ ఘటనలు జరుగుతుంటే హోం మంత్రి ఏం చేస్తున్నట్లు పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఇది పెద్ద సంచలనమే రేపింది. రాష్ట్రంలో శాంతి భధ్రతలు గాడి తప్పాయని హోం మంత్రి బాధ్యత వహించాలని సాక్షాత్తు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ హాట్ కామెంట్ చేయడంతో కూటమిలో ఒక్కసారిగా కలవరం మొదలైంది. అసలు పవన్ ఎందుకు ఇలా మాట్లాడారు అని టీడీపీతో పాటు కూటమిలో పెద్ద చర్చ జరిగింది. అంతే కాదు తాను హోం మంత్రి ఐతే పరిస్థితి మరోలా ఉండేది అని కూడా పవన్ అనడం వెనుక ఏదైనా రాజకీయ కోణం ఉందా అన్న చర్చ కూడా అప్పుడు జరిగింది.
ఇలా వరుస బెట్టి పవన్ కళ్యాణ్ టీడీపీ నేతలపై ఫైర్ అవుతుండడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పవన్ వాంటెడ్ లీ టీడీపీనీ ఏమైనా టార్గెట్ చేశారా అన్న చర్చ ఏపీ పాలిటిక్స్ లో జరుగుతుంది. పవన్ వ్యాఖ్యలపై మాత్రం ఇప్పటి వరకు టీడీపీ పెద్దలు ఎవరూ కూడా స్పందించలేదు. పవన్ వ్యాఖ్యలపై మాట్లాడటానికి టీడీపీ నేతలు ఎవరూ కూడా ముందకు రావడం లేదు. కానీ అదే సమయంలో అంతర్గతంగా మాత్రం పవన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు, క్యాడర్ మండిపడుతుంది. అధికారంలో భాగమై ఉండి సొంత ప్రభుత్వం, అధికార పార్టీ నేతలపై పవన్ ఇలా బహిరంగంగా కామెంట్స్ చేయడం మిత్ర ధర్మం అవుతుందా అని ప్రశ్నిస్తున్నారు. పవన్ వ్యాఖ్యలకు తాము కూడా కౌంటర్ ఇవ్వవచ్చు కానీ అది కూటమి ధర్మాన్ని అనుసరించి వెనుకంజ వేస్తున్నామని టీడీపీ నేతలు చెప్పుకొస్తున్నారు.
టీడీపీలో మరోవర్గం మాత్రం పవన్ ను ఇలానే వదిలేస్తే భవిష్యత్తులో టీడీపీకీ రాజకీయంగా ఇబ్బంది తప్పదు అని హెచ్చరిస్తున్నారు. టీడీపీ నేతలు తప్పు చేస్తే పవన్ సీరియస్ అవుతున్నారనే భావన ప్రజల్లో కలిగే అవకాశం ఉందని వారు అధిష్టానానికి వివరిస్తున్నారంట.అధినేత చంద్రబాబు పవన్ ను పిలిపించుకొని ఒక సారి ఈ విషయాలపై మాట్లాడితే బాగుంటుందని సలహా ఇస్తున్నారట. లేని పక్షంలో పార్టీకీ డ్యామేజ్ తప్పదని టీడీపీ నేతలు వార్నింగ్ ఇస్తున్నారట. మరోవైపు ఇప్పటికే పవన్ వల్లే కూటమి అధికారంలోకి వచ్చామనే ప్రచారం ఏపీలో తీవ్రంగా జరుగుతుందని ఇప్పుడు మనం సైలెంట్ గా ఉంటే ప్రజల్లోకి రాంగ్ సిగ్నల్స్ వెళుతాయని టీడీపీ పెద్దలకు చెప్పే యత్నం చేస్తున్నారట
మొత్తానికి పవన్ తీరు ఇప్పుడు ఏపీలో పెద్ద సంచలనంగా మారింది. ప్రస్తుతానికి పవన్ తీరుపై సైలెంట్ గా ఉన్న టీడీపీ పెద్దలు భవిష్యత్తులో ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
ఇదీ చదవండి: Pushpa 2 the Rule First Review: ‘పుష్ప 2 ది రూల్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లు అర్జున్ కుమ్మినట్టేనా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter