విశాఖ పోర్టు ట్రస్టులో అగ్నిప్రమాదం

fire accident at Vizag port | గత కొన్ని రోజులుగా ఏపీలో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. విశాఖ పోర్టు ట్రస్టులో అగ్ని ప్రమాదం సంభవించింది. వెస్ట్ క్యూ ఫైవ్ బెర్త్‌లో ఓ నౌక ఇంజిన్ నుంచి పోగలు వచ్చాయి.

Updated: Aug 9, 2020, 06:34 PM IST
విశాఖ పోర్టు ట్రస్టులో అగ్నిప్రమాదం
విశాఖ పోర్టు ట్రస్టు

గత కొన్ని రోజులుగా ఏపీలో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. నేటి వేకువజామున విజయవాడలోని కోవిడ్19 పేషెంట్లున్న హోటల్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. కొన్ని గంటల వ్యవధిలో విశాఖ పోర్టు ట్రస్టులో అగ్ని ప్రమాదం సంభవించింది. వెస్ట్ క్యూ ఫైవ్ బెర్త్‌లో ఓ నౌక ఇంజిన్ నుంచి పోగలు వచ్చాయి. ఇది గమనించిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. విజయవాడలో విషాదం: 11కి చేరిన మృతుల సంఖ్య

ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని, జాగ్రత్తల నడుమ మంటలు ఆర్పే యత్నం చేస్తున్నారు. అసలే ఇంజిన్ రూమ్ కావడంతో పోర్టులో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చునని పోర్టు అధికారులు భావిస్తున్నారు. ఆ కోస్టల్ షిప్పింగ్ బోటు చెన్నై నుంచి శనివారం రాత్రే విశాఖ పోర్టుకు వచ్చిందని తెలిపారు. ఫైర్ సిబ్బంది వెంటనే మంటలార్పేశారని, స్వల్ప అగ్ని ప్రమాదమేనని, కంగారు అక్కర్లేదని స్పష్టం చేశారు. నౌకలలోకి సిబ్బందిని మార్చేందుకు కోస్టల్ బోట్స్‌ను వినియోగిస్తారు.  RGV లెస్బియన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘డేంజరస్’ 
రానా పెళ్లిలో సమంత సందడే సందడి