Thota Chandrasekhar: బీఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్

Thota Chandrasekhar to Join BRS: బిఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా అవతరించిన నేపథ్యంలో జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ కార్యక్రమాలపై ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టిసారించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా బిఆర్ఎస్ పార్టికి ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ అధ్యక్షుడు సైతం ఖరారైనట్టు తెలుస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 2, 2023, 06:27 AM IST
Thota Chandrasekhar: బీఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్

Thota Chandrasekhar to Join BRS: ఏపీలో బిఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడు ఖరారైనట్టు తెలుస్తోంది. మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు సమాచారం అందుతోంది. సీఎం కేసీఆర్ సమక్షంలో సోమవారం ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్యలో హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఈ కార్యక్రమం ఉండే అవకాశం ఉంది.

తోట చంద్రశేఖర్ తో పాటు ఆయన నేతృత్వంలో ఏపీలో బిఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్న ఇంకొంత మంది నేతలు కూడా సోమవారం హైదరాబాద్ వచ్చి ఇదే వేదికపై కేసీఆర్, తోట చంద్రశేఖర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. ఏపీ రాజకీయాలు, కులాల వారీగా సామాజిక అంశాలపై పూర్తి అవగాహన ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. ఏపీలో తన పార్టీ ఎదుగుదల కోసం తోట చంద్రశేఖర్ ని నాయకుడిగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. 

ఇదిలావుంటే, మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్న నేపథ్యంలో ఏపీలో ఆయన నాయకత్వంలో బిఆర్ఎస్ కి భవిష్యత్ ఉంటుందని విశ్వసిస్తున్న పలువురు నాయకులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఏపీలో పలు రాజకీయ పార్టీల్లో తమ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న నేతలు బిఆర్ఎస్ వైపు చూస్తున్నట్టు సమాచారం. వారంతా తోట చంద్రశేఖర్ నేతృత్వంలో బిఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని వార్తలొస్తున్నాయి. 

ఉత్తరాదిన, దక్షిణాదిన బిఆర్ఎస్ పార్టీ విస్తరణ ఎలా ఉన్నా.. ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా.. పొరుగు రాష్ట్రం.. అందునా తెలుగు రాష్ట్రం అయిన ఏపీలో ఆ పార్టీకి రాజకీయ భవిష్యత్ ఎలా ఉండనుందా అనేదే ప్రస్తుతం రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాష్ట్ర విభజన కోరుకుని తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసమే ఏర్పాటై, పోరాడిన టీఆర్ఎస్ కమ్ బిఆర్ఎస్ పార్టీకి ఏపిలో రాజకీయ భవిష్యత్ ఎలా ఉండనుందనేదే ప్రస్తుతం రాజకీయవర్గాల్లో చర్చనియాంశమైంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో బిఆర్ఎస్ పార్టీ బాధ్యతలను తోట చంద్రశేఖర్ చేతిలో పెడుతుండటాన్ని రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

ఇది కూడా చదవండి : Vidadala Rajani: అరకేజీ నూనె, కందిపప్పు, చీర ఇస్తామని చెప్పి ప్రాణాలు తీశారు.. ఏకిపారేసిన మంత్రి విడదల రజిని

ఇది కూడా చదవండి : Guntur Stampede: గుంటూరు తొక్కిసలాటలో ముగ్గురి మృతి.. స్పందించిన సీఎం జగన్

ఇది కూడా చదవండి : Liquor Sales: కాసుల వర్షం కురిపించిన మందుబాబులు.. తెలుగు రాష్ట్రాల్లో రికార్డుస్థాయిలో లిక్కర్ సేల్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News