AP Assembly Speaker: రఘురామకు షాకిచ్చిన చంద్రబాబు.. ఏపీ స్పీకర్‌గా మాజీ మంత్రి ఫిక్స్..!

Andhra Pradesh Assembly New Speaker: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడు పేరు కన్ఫార్మ్ అయింది. తాను ఈ నెల 24న అసెంబ్లీ స్పీకర్‌ అవుతానని.. తప్పు చేసిన అధికారులను ఎవరినీ వదిలిపెట్టనని హెచ్చరించారు. ఆయనే స్పీకర్ అని సోషల్ మీడియాలో కూడా పోస్టులు వైరల్ అవుతున్నాయి.   

Written by - Ashok Krindinti | Last Updated : Jun 19, 2024, 12:54 PM IST
AP Assembly Speaker: రఘురామకు షాకిచ్చిన చంద్రబాబు.. ఏపీ స్పీకర్‌గా మాజీ మంత్రి ఫిక్స్..!

Ayyanna Patrudu AP Assembly New Speaker: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ పోస్ట్ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి (Ayyanna Patrudu) కి దక్కింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ నెల 21, 22వ తేదీల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. రెండు రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముందుగా ఈ నెల 24వ తేదీ నుంచి సమావేశాలు నిర్వహించాలని భావించినా.. ముందే నిర్వహిస్తోంది. రెండు రోజుల సభలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక ప్రక్రియను నిర్వహించనున్నారు. ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించే అవకాశం ఉండగా.. కొత్త స్పీకర్‌ (AP Assembly Speaker) గా అయ్యన్న పాత్రుడు ఎంపిక అవుతారని ప్రచారం జరిగింది.

Also Read: AP Inter Supply Results: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. చెక్‌ చేసుకోవడం ఇలా

తాజాగా అయ్యన్న పాత్రుడు తానే కాబోయే స్పీకర్ అని కన్ఫార్మ్ చేశారు. తాను 24న అసెంబ్లీ స్పీకర్ అవుతానని.. తప్పు చేసిన అధికారులను విడిచిపెట్టనని హెచ్చరించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన అధికారులను విడిచి పెట్టేది లేదని  స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో ఆరిలోవ అటవీ ప్రాంతంలో ఆర్ అండ్ బి రోడ్డు, మున్సిపాలిటీ ఆర్ ఎం బి రోడ్లను సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. నాణ్యత పరిణామాలకై, క్వాలిటీ అధికారుల వద్ద నుంచి స్పష్టమైన వివరణ రాకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు.

ఎన్నికల్లో ఓట్ల కోసం అర్ధరాత్రి కూడా రోడ్డు పనులు చేశారు కదా..? అని ఆర్ అండ్ బి అధికారులు మాజీ మంత్రి నిలదీశారు. అయితే ఈ పనులలో నాణ్యత లేనందున బిల్లులు చేయకూడదని ఆదేశించారు. 2017 సంవత్సరంలో తాను ఆర్ అండ్ బి మంత్రిగా ఉన్నప్పుడు గొలుగొండ మండలం కృష్ణదేవిపేట నుంచి నర్సీపట్నం మార్గంలో 26 కిలోమీటర్లకు  ఒక్కొక్క కిలోమీటర్‌కు కోటి రూపాయలు చొప్పున నిధులు విడుదల చేశానని.. ఆ నిధులతో ఏడు సంవత్సరాలుగా ఆర్ అండ్ బి రోడ్డు  పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈరోజు పరిశీలించగా నాణ్యత పాటించకుండా అసంపూర్ణంగా  సాగుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు 

ఈ పనులపై పూర్తి నివేదిక ఒక వారం రోజుల్లో ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎంక్వయిరీ నిర్వహించి.. బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేస్తామన్నారు. తాను అసెంబ్లీ స్పీకర్‌గా చట్టసభలో నియమితులైన మరుక్షణమే సభాముఖంగా సంబంధించిన అధికారులు వివరణ ఇవ్వవలసి వస్తుందని హెచ్చరించారు.

అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం మాజీ ఎంపీ, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు గట్టిగానే ప్రయత్నించారు. ప్రజలు తనను స్పీకర్‌గా చూడాలని అనుకుంటున్నారని ఆయన ఎన్నికలకు ముందు నుంచి చెబుతున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం రఘురామ పేరు ప్రముఖంగా వినపడింది. అయితే సీనియర్ నాయకుడు అయిన చింతకాయల అయ్యన్నపాత్రుడు వైపు సీఎం చంద్రబాబు మొగ్గు చూపారు. నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఆయన 24,676 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1982 పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలోనే కొనసాగుతున్నారు. 1983, 1985, 1994, 1999, 2004, 2014, 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన అయ్యన్న.. ఏడోసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. 1996లో అనకాపల్లి నుంచి ఎంపీగా గెలిచి లోక్‌సభకు వెళ్లారు. ఎన్టీఆర్‌, చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేశారు. ఈసారి కూడా ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని అందరూ భావించగా.. స్పీకర్ పదవి వరించింది. త్వరలో అధికారిక ప్రకటన రానుంది. 

Also Read: Nayanthara: ఆటో డ్రైవర్, డెలివరీ అబ్బాయితో గొడవపడి.. ఇల్లు ఖాళీ చేసిన నయనతార..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News