ఇక నుంచి తెలుగులోనే ఉత్తర.. ప్రత్యుత్తరాలు

Last Updated : Nov 29, 2017, 07:25 PM IST
ఇక నుంచి తెలుగులోనే ఉత్తర.. ప్రత్యుత్తరాలు

తెలుగు నేలపై తెలుగు బాషకు మరింత ప్రాధాన్యత దక్కింది.  గ్రామ స్థాయి నుంచి సచివాలయం వరకు  ప్రభుత్వ ఉద్యోగులందరూ తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరగనున్నాయి. ఈ మేరకు చంద్రబాబు ప్రకటించారు. వివరాల్లోకి వెళ్లినట్లయితే ..తెలుగు బాషా ప్రాధాన్యతపై బుధవారం ఏపీ అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలోనే తెలుగు ఉందన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ.. తమ తెలుగుదేశం పార్టీ అని వెల్లడించారు .

తెలుగువారి ఆత్మగౌవరంతో పాటు బాషను పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని ఏపీ సీఎం పేర్కొన్నారు. తెలుగు భాషను పరిరక్షించినప్పుడే భవిష్యత్తు తరాలు హర్షిస్తాయని వెల్లడించారు. ఇక నుంచి గ్రామ స్థాయి నుంచి సచివాలయం వరకు ప్రభుత్వ ఉద్యోగులందరూ తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేలా చూస్తామని చెప్పారు. న్యాయపాలన కూడా తెలుగులోనే ఉండాలని రఘునాథ్ రెడ్డి కమిటీ సూచించిందని .. కమిటి సూచనలను అమలు చేస్తామని ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు.

హర్షం వ్యక్తం ..

ఇటీవలి కాలంలో తెలుగు బాషకు ప్రాధాన్యమిస్తూ ఇంటర్ వరకు తెలుగు బాషను ద్వితియ భాషగా తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది చంద్రబాబు సర్కార్..కాగా తాజాగా ఇప్పడు గ్రామ స్థాయి నుంచి సచివాలయం ఉద్యోగులందరూ తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలన్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Trending News