Telugu Language: దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయులు ఏ సందర్భాన చెప్పారో కానీ..అదే ప్రతిబింబిస్తోంది. ఖండాలు దాటి మరీ తెలుగు భాష ఖ్యాతి విస్తరిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో అగ్రభాషగా ఎదుగుతోంది.
పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో మమతా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బెంగాల్లో తెలుగు భాషకు అధికార హోదా ఇస్తూ టీఎంసీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
తెలుగు నేలపై తెలుగు బాషకు మరింత ప్రాధాన్యత దక్కింది. గ్రామ స్థాయి నుంచి సచివాలయం వరకు ప్రభుత్వ ఉద్యోగులందరూ తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరగనున్నాయి. ఈ మేరకు చంద్రబాబు ప్రకటించారు. వివరాల్లోకి వెళ్లినట్లయితే ..తెలుగు బాషా ప్రాధాన్యతపై బుధవారం ఏపీ అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలోనే తెలుగు ఉందన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ.. తమ తెలుగుదేశం పార్టీ అని వెల్లడించారు .
అమ్మభాషకు ఎట్టకేలకు న్యాయం జరిగింది. ఇంటర్ వరకు తెలుగు భాషను తప్పనిసరి చేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. త్వరలో దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని చంద్రబాబు తన నిర్ణయాన్ని ప్రకటించారు. తాజా నిర్ణయం అమల్లోకి వస్తే ఇంటర్లో ద్వితియ భాషగా తెలుగును తప్పనిసరిగా ఎంచుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకు ఉన్న విధానంలో పదవ తరగతి వరకు తెలుగు భాష ప్రధమ భాషగా ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.