భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం, వెండి ధరల్లో శుక్రవారం పెరుగుదల కనిపించింది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా వున్న అన్ని మెట్రోపాలిటన్ నగరాల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.300 పెరగగా కిలో వెండి ధర రూ.70 మేర పెరిగింది. హైదరాబాద్‌లో 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.300 మేర పెరిగి రూ.39,940కి చేరింది. అలాగే 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.280 పెరిగి మొత్తం రూ.36,620 మార్కుని తాకింది. ఇక విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ 24 క్యారట్ల బంగారం ధర 39,940, 22 క్యారట్ల బంగారం ధర రూ. 36,620 వద్ద ట్రేడ్ అయింది. దేశ రాజధాని ఢిల్లీలోనూ రూ.300 పెరిగిన 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.38,600కి మార్కుని తాకగా 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.300 మేర పెరిగి రూ.37,400 కి చేరింది. 

Updated: Nov 15, 2019, 09:05 PM IST
భారీగా పెరిగిన బంగారం ధరలు
Representational image

హైదరాబాద్: బంగారం, వెండి ధరల్లో శుక్రవారం పెరుగుదల కనిపించింది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా వున్న అన్ని మెట్రోపాలిటన్ నగరాల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.300 పెరగగా కిలో వెండి ధర రూ.70 మేర పెరిగింది. హైదరాబాద్‌లో 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.300 మేర పెరిగి రూ.39,940కి చేరింది. అలాగే 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.280 పెరిగి మొత్తం రూ.36,620 మార్కుని తాకింది. ఇక విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ 24 క్యారట్ల బంగారం ధర 39,940, 22 క్యారట్ల బంగారం ధర రూ. 36,620 వద్ద ట్రేడ్ అయింది. దేశ రాజధాని ఢిల్లీలోనూ రూ.300 పెరిగిన 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.38,600కి మార్కుని తాకగా 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.300 మేర పెరిగి రూ.37,400 కి చేరింది. 

హైదరాబాద్‌ సహా ఢిల్లీలోనూ కిలో వెండి ధర రూ.70 మేర పెరిగి రూ. 48,840 వద్ద ట్రేడ్ అవుతోంది.