Good News for Teachers: ఏపీలో త్వరలో టీచర్ల బదిలీలు..ఎలా జరుగుతాయంటే..

Good News for Teachers: ఏపీలో టీచర్లకు శుభవార్త. త్వరలో బదిలీలు జరగనున్నాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. అవినీతికి ఆస్కారం లేకుండా పూర్తిగా పారదర్శకంగా ఉపాధ్యాయ బదిలీలు చేపడుతున్నట్టు మంత్రి స్పష్టం చేశారు.

Last Updated : Dec 11, 2020, 08:30 PM IST
  • త్వరలో ఉపాధ్యాయ బదిలీలు..ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
  • ఉపాధ్యాయుల్ని నాలుగు కేటగరీల్లో విభజన...వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు
  • బదిలీ ప్రక్రియను యూట్యూబ్ ఛానెల్లో డెమో పెట్టామని చెప్పిన మంత్రి సురేష్
Good News for Teachers: ఏపీలో త్వరలో టీచర్ల బదిలీలు..ఎలా జరుగుతాయంటే..

Good News for Teachers: ఏపీలో టీచర్లకు శుభవార్త. త్వరలో బదిలీలు జరగనున్నాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. అవినీతికి ఆస్కారం లేకుండా పూర్తిగా పారదర్శకంగా ఉపాధ్యాయ బదిలీలు చేపడుతున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. 

చాలాకాలంగా బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం ( Ap government ) శుభవార్త విన్పించింది. త్వరలో టీచర్ల బదిలీ ప్రక్రియను చేపడుతున్నట్టు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ( Ap minister adimulapu suresh ) ప్రకటించారు. ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియను వెబ్ కౌన్సిలింగ్ ( Web Counselling ) విధానంలో నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే  వివిధ ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడామన్నారు. వెబ్ కౌన్సిలింగ్‌కు ఏవిధంగా వెసులుబాటు ఇవ్వాలనే దానిపై  ఒక డెమోను యూట్యూబ్ చానెల్లో అందుబాటులో ఉంచామన్నారు.  ఉపాధ్యాయులు ఈ వీడియో సహాయంతో వివరాలు తెలుసుకుని.. వెబ్ కౌన్సిలింగ్‌కు అప్షన్స్ ఇవ్వాలని మంత్రి సురేష్ విజ్ణప్తి చేశారు.

నవంబర్ 28 నుంచి రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీ ( Teachers transfer ) కు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించామన్నారు. నవంబరు 30 నుండి ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను సిద్ధం చేశామని..డిసెంబర్ 3 నుండి 7 వరకూ అభ్యంతరాలుంటే డిఇఓలకు చెప్పాలన్నారు.  ఆ తరువాత డిసెంబర్  8 నుండి 10 లోగా తుది జాబితాను సిద్ధం చేయాల్సిందిగా డిఇఓలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. డిసెంబర్ 16 నుంచి  21 వరకూ ఉపాధ్యాయుల బదిలీల తుది కేటాయింపు ఉంటుందన్నారు. 

20 శాతం హెఆచ్ఆర్ఏ ఉన్న ప్రాంతాలను కేటగిరీ-1 గా, 14.5శాతం హెచ్ఆర్ఏ ఉన్న ప్రాంతాలను కేటగిరీ-2 గా, 12శాతం హెచ్ఆర్ఏ ఉన్న ప్రాంతాలను కేటగిరీ-3 గా, 12 శాతం కంటే తక్కువ హెచ్ఆర్ఏ ఉన్న ప్రాంతాలను కేటగిరీ-4 గా విభజించి బదిలీల ప్రక్రియను చేపట్టనున్నట్టు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో సుమారు లక్షా 72 వేల వరకూ మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు ఉండగా వాటిలో 15 వేల పోస్టులను బ్లాక్ చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఈ విధంగా బ్లాకు చేసిన పోస్టులను బదిలీల ప్రక్రియ పూర్తయ్యాక మారుమూల, గిరిజన ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తూ రెగ్యులర్ ప్రక్రియలో భర్తీ చేస్తామన్నారు. Also read: Eluru Mystery Disease: ఏలూరు తాగునీటిపై ఢిల్లీ ఎయిమ్స్ నివేదికలో ఏముందో తెలుసా…

Trending News