తెలుగు కుర్రోడిని వరించిన గొప్ప అవకాశం.. భారత టెస్ట్ జట్టులో చోటు

ఇంగ్లండ్ vs ఇండియా : ఇంగ్లండ్‌తో ఆడనున్న టీమిండియా టెస్ట్ జట్టులో తెలుగు కుర్రాడికి చోటు

Last Updated : Aug 23, 2018, 06:50 PM IST
తెలుగు కుర్రోడిని వరించిన గొప్ప అవకాశం.. భారత టెస్ట్ జట్టులో చోటు

ఇప్పటివరకు రంజీ ట్రోఫీల్లో తన సత్తా చాటిన ఓ తెలుగు యంగ్ క్రికెటర్‌కి తాజాగా టీమిండియా టెస్ట్ జట్టులో చోటు లభించింది. ఆ కుర్రాడు ఎవరో కాదు.. గతంలో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహించి ప్రస్తుతం ఆంధ్రా రంజి జట్టుకు కెప్టేన్‌గా వ్యవహరిస్తోన్న గాదె హనుమ విహారినే. అవును, హనుమ విహారి టీమిండియా టెస్ట్ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ మేరకు టీమిండియా జట్టు ఇంగ్లండ్‌తో ఆడనున్న చివరి రెండు టెస్ట్ మ్యాచ్‌ల కోసం సెలక్షన్ కమిటీ బుధవారం ప్రకటించిన జట్టు ఆటగాళ్ల జాబితాలో హనుమ విహారి పేరు కూడా ఉంది. హనుమ విహారితోపాటు పృద్వీ షా సైతం ఈ రెండు మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం సొంతం చేసుకున్నాడు.

ఈ రెండు టెస్టు మ్యాచ్‌ల్లో హనుమ విహారి తన సత్తా చాటుకున్నట్టయితే, భవిష్యత్ లో టీమిండియా జట్టులో అతడి స్థానానికి ఏ డోకా ఉండదని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Trending News