Have You Lost Your Phone: మీ ఫోన్ పోయిందా ? డోంట్ వర్రీ.. రికవరి చేసిస్తాం అంటున్న చిత్తూరు జిల్లా ఎస్పీ

Have You Lost Your Phone: మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న భాదితులు కేవలం చిత్తూరు జిల్లా నుండే కాకుండా ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి కూడా ఫిర్యాదు చేస్తున్నారు. వారి ఫోన్‌లను కూడా రికవరీ చేసి అందజేస్తున్నాం. ఇంకా పెండింగ్ రికవరీలు ఉన్నాయని వాటిని కూడా అతిత్వరలోనే రికవరీ చేసి భాదితులకు అందచేస్తామని చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 21, 2023, 07:57 AM IST
Have You Lost Your Phone: మీ ఫోన్ పోయిందా ? డోంట్ వర్రీ.. రికవరి చేసిస్తాం అంటున్న చిత్తూరు జిల్లా ఎస్పీ

Have You Lost Your Phone: ఒక భాదితురాలి నుంచి ఫిర్యాదు అందిన 4 గంటలలోపే చోరీకి గురైన ఆమె మొబైల్ ఫోన్ ని రికవరీ చేసాం. కొన్ని కేసులోల ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి కూడా ఫోన్లను రికవరి చేసి భాధితులకు అందించాం. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, ఢిల్లీ, కేరళ, బీహార్ వంటి రాష్ట్రాల నుండి సైతం మొబైల్ ఫోన్ల రికవరీ చేశాం. బాధితుల ఫోన్లను రికవరీ చేసి ఇవ్వడంతో బాధితులు సైతం ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల బాధితుల నుండి కూడా ఫిర్యాదులు అందుతున్నాయి. "CHAT BOT" సేవలతో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు మరింత సులువుగా సేవలు అందివ్వడానికి వీలు కలుగుతోంది అని చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు. 

మొబైల్స్ ట్రేస్ చేసిన చిత్తూరు జిల్లా పోలీస్ అధికారులు, ఇతర సిబ్బందిని జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి అభినందించారు. చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్ కాన్ఫరెన్స్ హాలులో “మొబైల్ రికవరీ మేళా" కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మారుతున్న జీవనశైలిలో మొబైల్ వినియోగం ఎక్కువై మనలో ఒకటిగా మారిపోయిందని.. అందులోనే కీలక సమాచారం నిక్షిప్తమై ఉండటంతో మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న వారి బాధ వర్ణనాతీతంగా ఉంటోంది అని అన్నారు. అటువంటి మొబైల్ ఫోన్లను ఎటువంటి కంప్లయింట్ లేకుండా
పోలీస్ స్టేషన్ కు వెళ్ళకుండా ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయకుండా ఇంట్లో కూర్చొని చిత్తూరు పోలీసులు వారి “చాట్ బాట్” సేవల ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను మళ్లీ తిరిగి పొందవచ్చునని తెలిపారు.

ఈ రోజు 500 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు మంచి సేవలందించేందుకు చాట్ బాట్ బృందం మొబైల్ ట్రాకింగ్‌పై బాగా పని చేస్తున్నాయన్నారు.
పోయిన మొబైల్ ఫోన్లు మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు అయిన జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, ఢిల్లీ, కేరళ, బీహార్, పంజాబ్, మన ఏపీకి సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్నాటక వంటి రాష్ట్రాల నుండి మొబైల్ ఫోన్ల రికవరీ చేసి భాదితులకు అందజేసిన పోలీస్ సిబ్బంది పని తీరు హర్షనీయమని సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. 

మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న భాదితులు కేవలం చిత్తూరు జిల్లా నుండే కాకుండా ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి కూడా ఫిర్యాదు చేస్తున్నారు. వారి ఫోన్‌లను కూడా రికవరీ చేసి అందజేస్తున్నాం. ఇంకా పెండింగ్ రికవరీలు ఉన్నాయని వాటిని కూడా అతిత్వరలోనే రికవరీ చేసి భాదితులకు అందచేస్తామని చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు. పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్ వివరాలను తెలియజేస్తే.. బాధితులకు త్వరితగతిన వాటిని రికవరి చేసి అందజేసేందుకు కృషి చేస్తామని ఎస్పీ రిశాంత్ రెడ్డి స్పష్టంచేశారు. 

మీ వివరాలు CHAT BOT కు పంపవలసిన విధానం :
మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారు ముందుగా 9440900004 నంబర్‌కు వాట్సాప్ ద్వారా HI, లేదా Help అని టెక్ట్స్ పంపాలి.
తర్వాత వెనువెంటనే Welcome to Chittoor Police పేరున ఒక అంకే HI లేదా HELP అని పంపిన మొబైల్‌కు మెసేజ్ వస్తుంది.
ఆ లింకులో గూగుల్ ఫార్మాట్ ఓపెన్ అవుతుంది. ఆ వివరాలను పూరించాలి. డిస్ట్రిక్ట్, పేరు, వయస్సు, తండ్రి, చిరునామా, కాంటాక్టింగ్ నంబర్, మిస్సయిన మొబైల్ మోడల్, IMEI నంబర్, మిస్ అయిన ప్లేస్ వివరాలను సబ్మిట్ చేసిన వెంటనే కంప్లైంట్ లాడ్జి అవుతుంది.

"CHAT BOT” సేవలను ప్రజలు వినియోగించుకోవాలని, ఫోన్ చోరీకి గురయినా... మిస్ అయినా వెంటనే వాట్సాప్ నంబర్ 9440900004 కు HI లేదా HELP అని మెసేజీ పంపాలని చిత్తూరు జిల్లా ఎస్పీ చిత్తూరు జిల్లా ప్రజలను కోరారు. అతితక్కువ సమయంలో 500 మొబైల్ ఫోన్ లను రికవరీ చేసి బాధితులకు అందజేసేందుకు కృషి చేసిన క్రైమ్ సి.ఐ. భాస్కర్, క్రైమ్ ఎస్.ఐ. ఉమా మహేశ్వర రావు, వారి సిబ్బందిని ఎస్పీ సర్టిఫికేట్, కాష్ రివార్డుతో సత్కరించి అభినందించారు.

Trending News