బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఇంకా కొనసాగుతుండటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో గడిచిన 24 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా స్కైమెట్‌వెదర్.కామ్ వెల్లడించిన వాతావరణ నివేదిక ప్రకారం ఖమ్మం, భద్రాచలం కృష్ణా జిల్లా నందిగామలో భారీ వర్షపాతం నమోదైంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ కేంద్రం తెలిపింది. ఇదే అల్పపీడనం ప్రభావం కారణంగా కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టంచేసింది. ఏపీలోని సముద్ర తీర ప్రాంతాల్లోని మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.
ఇదిలాఉంటే, ఓవైపు కేరళ రాష్ట్రాన్ని వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తుండగా మరోవైపు ఆ పొరుగునే ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతోపాటు ఒడిషాలోనూ ఓ మోస్తరు వర్షాలు కురుస్తు్న్నాయి.
తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు !