AP 3 Capitals: ఏపీ మూడు రాజధానుల అంశం మళ్లీ మొదటికొచ్చిందా..? వికేంద్రీకరణపై జగన్ ప్రభుత్వం ఏం చెబుతోంది..? సభ ముందుకు రాజధానుల బిల్లు ఎప్పుడు రానుంది..? అమరావతి రైతుల భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది. ఏపీ త్రి క్యాపిటల్స్‌పై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం.
దేశవ్యాప్తంగా ఏపీ మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా వికేంద్రీకరణపై అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ వైఖరిని సీఎం జగన్ స్పష్టం చేశారు. తాము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పారు. ఏపీ అసెంబ్లీలో వికేంద్రీకరణపై చర్చ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం ప్రకారం చట్టం చేసే అధికారం సభకు ఉందన్నారు. హైకోర్టు తీర్పు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని.. రాజధాని నిర్ణయం రాష్ట్రాలదేనని కేంద్రం చెప్పిందని గుర్తు చేశారు జగన్.
సీఎం జగన్ వ్యాఖ్యలపై ప్రధాన ప్రతిపక్షం భగ్గుమంది. మళ్లీ అసెంబ్లీలో మూడు ముక్కలాట మొదలు పెట్టారని ఫైర్ అయ్యింది. రాజ్యాంగం లోబడే ప్రభుత్వాలు నడుచుకోవాలంటున్నారు టీడీపీ నేతలు. సీఆర్డీఏ చట్టం ప్రకారం ముందుకు వెళ్లాలని హైకోర్టు చెప్పిందని.. ప్రభుత్వం గుర్తించుకోవాలంటున్నారు. కనీస జ్ఞానం లేకుండా కోర్టులపై వ్యాఖ్యలు చేయడం ఏంటని మండిపడుతున్నారు.
జగన్ ప్రభుత్వ తీరుపై అమరావతి రైతులు సైతం ఫైర్ అవుతున్నారు. హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా.. ప్రభుత్వం పాటించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రాజధానిపై తమ పోరాటం కొనసాగుతునే ఉంటుందని అంటున్నారు. త్వరలో అసెంబ్లీ ముందుకు మూడు రాజధానుల బిల్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈమేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: RRR Movie: ఏఎంబీ మాల్‌లో ఆర్‌ఆర్‌ఆర్ స్పెషల్ షో.. సినిమాపై జూనియర్ ఎన్టీఆర్ రియాక్షన్..!!
Also Read: MS Dhoni: ప్రపంచకప్ ట్రోఫీతో వచ్చాడు.. ఐపీఎల్ టైటిల్‌తో ముగించాడు! కెప్టెన్‌గా ముగిస్తే బాగుండు!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook