Husband Kills Wife Over Extramarital Affair in Anantapur district Kadiri: భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడంపై రగిలిపోయాడు ఓ భర్త. తన కళ్లారా వారి అక్రమ సంబంధాన్ని చూసిన భర్త కోపంతో రగిలిపోయి రోకలిబండతో ఆమె తలపై బాది హత్య చేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా (Anantapur district) కదిరి (Kadiri) మండల పరిధిలోని పట్నం గ్రామంలో చోటుచేసుకుంది. పట్నం గ్రామానికి చెందిన శివశంకర్ (Sivashankar) ఆటో నడుపుతూ బతుకుతున్నాడు. శివశంకర్‌కు పదేళ్ల క్రితం సోమందేపల్లి మండలం గుడిపల్లికి (Gudipalli) చెందిన యువతితో పెళ్లి అయ్యింది. వీరికి ఏడేళ్ల ఏళ్ల కొడుకు, ఐదేళ్ల కూతురు ఉన్నారు.
అయితే శివశంకర్ భార్య పట్నం గ్రామంలోని మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయంలో చాలాసార్లు భార్యను (Wife) హెచ్చరించారు శివశకంర్. అయినా ఆమె లెక్క చేయలేదు. ఇక తాజాగా అర్ధరాత్రి ఇంట్లో తన భార్యతో.. ఆ వ్యక్తి కలసి ఉండడాన్ని కళ్లారా చూశాడు శివశంకర్. వెంటనే రోకలి బండతో భార్య తలపై బాదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి (Died) చెందింది.
Also Read :ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్.. ఇప్పుడు తెలుగులో..
తర్వాత వెంటనే తన భార్య తండ్రికి ఫోన్ చేసి నీ కూతురు అక్రమ సంబంధం పెట్టుకుంది.. ఎన్నోసార్లు హెచ్చరించినా పట్టించుకోలేదు... అందుకే చంపాను అంటూ చెప్పాడు శివశంకర్. పోలీసులు (Police) శివశంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు (Case) దర్యాప్తులో ఉంది.
Also Read :బాలకృష్ణ, కొరటాల కాంబోలో మల్టీస్టారర్ మూవీ? మరో హీరో మహేశ్‌బాబు అట!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
భార్య అక్రమ సంబంధాన్ని కళ్లారా చూసిన భర్త.. రోకలిబండతో కొట్టి హత్య
భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడంపై రగిలిపోయిన భర్త
రోకలిబండతో భార్య తలపై బాది హత్య
అనంతపురం జిల్లా కదిరి మండల పరిధిలోని పట్నం గ్రామంలో ఘటన