Heat Waves Alert: ఈసారి వేసవి తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి అధిక ఉష్ణోగ్రతలు నమోదవడమే కాకుండా వడగాల్పులు తీవ్రంగా ఉంటాయని ఐఎండీ హెచ్చరించింది. ఇప్పటికే కోస్తాంధ్రలో వడగాల్పులు వీస్తుంటే, రాయలసీమలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతోంది. సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో 40-44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. రానున్న కొన్నిరోజుల్లో ఇది మరింత పెరగవచ్చని అంచనా. మే నెలలో అయితే పరిస్థితి అదుపు తప్పవచ్చనే సీరియస్ హెచ్చరికలున్నాయి. అంటే సాధారణం కంటే 5-6 డిగ్రీలు అత్యధికంగా ఉండవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం రాయలసీమలో కోస్తాంద్ర కంటే ఎక్కువ ఉష్ణోగ్రత కన్పిస్తోంది. అత్యధికంగా నెల్లూరులో 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 5 డిగ్రీలు అధికం కావడం గమనార్హం.
రానున్న రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు ఉష్ణతీవ్రతతో అట్టుడికే పరిస్థితి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అంటే ప్రతి ప్రాంతంలోనూ సాధారణం కంటే 4-5 డిగ్రీలు అధికంగా ఉండవచ్చని అంచనా. వాతావరణ వేడిగా ఉండటం, తేమ లేకపోవడం తీవ్ర అసౌకర్యం కల్గించనుంది. ఏప్రిల్ ప్రారంభం నుంచే ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. వడగాల్పులు పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ముఖ్యంగా మే నెల వచ్చేసరికి ఎండలతో పాటు వడగాలులు ప్రతాపం చూపించనున్నాయి. గత ఏడాది కూడా ఎండలు చాలా ఎక్కువగా నమోదయ్యాయి. రాజమండ్రి, విజయవాడ, ఏలూరు ప్రాంతాల్లో అత్యధికంగా 50 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత నమోదైంది. వరుసగా 47-50 డిగ్రీల ఉష్ణోగ్రత నాలుగైదురోజులు కొనసాగిన పరిస్థితి ఉంది.
ఈ ఏడాది ఎన్నికల సమయం కావడంతో వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రభుత్వాలకు వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. ముఖ్యంగా ఎన్నికల కమీషన్‌కు ప్రత్యేక సూచనలు చేసింది.
Also read: Water Bell: డీ హైడ్రేషన్ నివారించేందుకు ఏపీ స్కూళ్లలో ఇకపై వాటర్ బెల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook