Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం జరగబోతోందని తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాలన్ని పొత్తుల చుట్టే తిరుగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించడమే లక్ష్యమంటున్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆసక్తికర కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. మార్చిలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పొత్తులపై కీలక ప్రకటన చేశారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తామన్నారు. పవన్ ప్రకటనతో విపక్షాలన్ని ఏకమవుతాయనే చర్చ సాగుతోంది. తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పొత్తులకు సై అన్నట్లుగా సిగ్నల్ చేశారు. నియంత పాలన సాగిస్తున్న జగన్ ను ఇంటికి పంపేందుకు తాము త్యాగాలకు కూడా సిద్దమంటూ.. పొత్తులకు సంకేతం ఇచ్చారు చంద్రబాబు. టీడీపీ నేతలు కూడా ఓపెన్ గానే పొత్తులపై మాట్లాడుతున్నారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కు మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా ప్రధాన విపక్షాలు ఏకమవుతాయా.. పొత్తులు ఎలా ఉండబోతున్నాయన్నదే కొన్ని రోజులుగా హాట్ హాట్ గా మారింది.
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం బీజేపీ-జనసేన పొత్తులో ఉన్నాయి. ఉమ్మడిగా కొన్ని సమావేశాలు కూడా నిర్వహించాయి. అంతేకాదు తమ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ఉంటారని కొందరు బీజేపీ నేతలు ప్రకటించారు. ఈ విషయంతో బీజేపీ హైకమాండ్ క్లారిటీ ఇచ్చిందంటున్నారు. అయితే టీడీపీ కూడా పొత్తు కలిస్తే పరిస్థితి ఏంటన్నది ఆసక్తిగా మారింది. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేశాయి. 2019లో కూడా అదే సీన్ రిపీట్ అవుతుందనే చర్చ ఉంది. అయితే బీజేపీ మాత్రం జనసేన విషయంలో క్లారిటీగా ఉన్నా.. టీడీపీ పొత్తుపై స్పష్టత ఇవ్వడం లేదు. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాత్రం తమకు టీడీపీతో పొత్తు ఉండదనే చెబుతున్నారు. సత్యకుమార్ లాంటి జాతీయ నేతలు మాత్రం టీడీపీ పొత్తు విషయంలో సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది. అటు పవన్ కల్యాణ్ మాత్రం టీడీపీతో పొత్తుకు ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు. కొందరు టీడీపీ నేతలు ఇప్పటికే జనసేన చీఫ్ తో చర్చలు కూడా జరిపారని అంటున్నారు. టీడీపీని కలుపుకుని పోయే విషయంపై బీజేపీ పెద్దలతో పవన్ మాట్లాడుతున్నారనే ప్రచారం జరిగింది. టీడీపీ మహానాడులోనూ ఖచ్చితందా పొత్తులు ఉంటాయని, కొందరు నేతలు త్యాగం చేయాల్సి వస్తుందనే సంకేతం ఇచ్చారు చంద్రబాబు. దీంతో 2014లానే మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయా లేక టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఉంటుందా.. బీజేపీ-జనసేనే కలిసి పోటీ చేస్తాయా అన్నదే చర్చనీయాంశంగా మారింది.
పొత్తులపై జోరుగా చర్చలు సాగుతుండగానే బీజేపీ నుంచి సంచలన వార్త బయటికి వచ్చింది. జనసేన - బీజేపీ ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధికారికంగా ప్రకటించబోతున్నారని సమాచారం. జూన్ 6న ఏపీలో పర్యటిస్తున్నారు జేపీ నడ్డా. బహిరంగసభలో పాల్గొననున్నారు. ఈ సభలోనే ఏపీకి సంబంధించి రోడ్ మ్యాప్ విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగానే తమ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ను జేపీ నడ్డా ప్రకటిస్తారని అంటున్నారు. ఆ తర్వాత రెండు పార్టీలు ఉమ్మడిగా పలు సభలు నిర్వహిస్తాయని.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరవుతారని ఏపీ బీజేపీ వర్గాల సమాచారం. ప్రధాని నరేంద్ర మోడీ కూడా వస్తారని చెబుతున్నారు. ఈ వార్తే ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ను ప్రకటిస్తే.. ఈ రెండు పార్టీలకు టీడీపీతో పొత్తు లేనట్టేనని భావిస్తున్నారు. మరీ టీడీపీతో పొత్తు వద్దని పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారా? బీజేపీ ఆఫర్ కు ఆయన ఓకే చెప్పారా? ఆయన అంగీకారంతోనే జేపీ నడ్డా ప్రకటన చేయబోతున్నారా అన్నది చర్చగా మారింది.
బీజేపీ వర్గాల నుంచి వస్తున్న తాజా వార్తలపై టీడీపీలోనూ చర్చ సాగుతోంది. బీజేపీ-జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ను ప్రకటించబోతున్నారన్న ప్రచారం ఉత్తదేనని తమ్ముళ్లు చెబుతున్నారు. జనసేన చీఫ్ తమతో టచ్ లో ఉన్నారని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని.. బీజేపీ విషయంలో మాత్రం ఏదైనా జరగవచ్చని అంటున్నారు. పొత్తు విషయంలో చంద్రబాబు, పవన్ క్లారిటీగా ఉన్నారని.. ఈ రెండు పార్టీలు కలిస్తే తమకు ఓటమి ఖాయమని భయంతో ఉన్న వైసీపీనే ఇలాంటి ప్రచారాలు చేస్తుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు మూడు పార్టీలు కలిసినా పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి సీటు కావాలని కోరితే టీడీపీ ఏం చేస్తుందన్నది ఆసక్తిగా మారింది. జగన్ రెడ్డిని ఓడించేందుకు ముఖ్యమంత్రి పదవిని పవన్ కు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమవుతారా అన్నది ప్రశ్నగా మిగులుతోంది. టీడీపీ కేడర్ కూడా ఈ విషయంలోనే టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది.
READ ALSO: IPL 2022 Closing Ceremony: ఐపీఎల్ 2022లో ముగింపు వేడుకలకు ప్రధాని మోదీ, అమిత్ షా?
READ ALSO: TDP Mahanadu: క్విట్ జగన్-సేవ్ ఆంధ్రప్రదేశ్..మహానాడు వేదికగా చంద్రబాబు పిలుపు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook