IPL 2022 Closing Ceremony: ఐపీఎల్ 2022లో ముగింపు వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా హాజరు?

IPL 2022 Closing Ceremony: ఐపీఎల్ 2022 ముగింపు వేడుకలకు సర్వం సిద్ధమైంది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్డేడియం వేదికగా టైటిల్ పోరుకు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ సిద్ధమయ్యాయి. ముగింపు వేడుకల్లో ఆ ఇద్దరు సెలెబ్రిటీలు దుమ్ము రేపనున్నారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 29, 2022, 07:51 AM IST
  • ఐపీఎల్ 2022 పైనల్ పోరుకు సర్వం సిద్ధం, ముగింపు వేడుకలు సాయంత్రం 6 గంటలకు ప్రారంభం
  • ఏఆర్ రెహమాన్, రణవీర్ సింగ్‌లతో పీఎల్ 2022 ముగింపు వేడుకలు
  • ఐపీఎల్ 2022 పైనల్‌కు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా హాజరయ్యే అవకాశాలు
IPL 2022 Closing Ceremony: ఐపీఎల్ 2022లో ముగింపు వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా హాజరు?

IPL 2022 Closing Ceremony: ఐపీఎల్ 2022 ముగింపు వేడుకలకు సర్వం సిద్ధమైంది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్డేడియం వేదికగా టైటిల్ పోరుకు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ సిద్ధమయ్యాయి. ముగింపు వేడుకల్లో ఆ ఇద్దరు సెలెబ్రిటీలు దుమ్ము రేపనున్నారు.

ఐపీఎల్ 2022 చివరిరోజు ఇవాళ. పైనల్ పోరు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది. అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్డేడియం వేదికగా జరగనున్న ఫైనల్ పోరును అత్యంత ఆకర్షణీయంగా, వేడుకగా నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. మ్యాచ్ కంటే ముందు అత్యద్భుతంగా ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్, బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ ప్రత్యేక షోలు దుమ్ము రేపనున్నాయి.

ఇవాళ సాయంత్రం 6 గంటల 25 నిమిషాలకు ఐపీఎల్ 2022 ముగింపు వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ నటులు ట్విట్టర్ సాక్షిగా ముగింపు వేడుకలపై ట్వీట్స్ చేశారు. ముగింపు వేడుకల్లోనే అమీర్ ఖాన్ సినిమా లాల్ సింగ్ చద్దా ట్రైలర్ విడుదల కానుంది. క్రికెట్ మ్యాచ్ వేదికపై ఓ సినిమా ట్రైలర్ విడుదల కావడం ఇదే తొలిసారి.ఐపీఎల్ ఫైనల్ పోరును వీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా హాజరుకావచ్చని తెలుస్తోంది. 

Also read: Dhoni Jharkhand Election: ఐపీఎల్ ముగిసిన తర్వాత ఎలక్షన్ డ్యూటీలో మహేంద్ర సింగ్ ధోనీ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News