Janasena MLA Rapaka Varaprasad Sensational Comments on MLC Elections: ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల రాష్ట్రంలో సంచలనం కల్గించాయి. బలం లేకున్నా అధికార పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపుతో టీడీపీ అభ్యర్ధి పంచుమర్తి అనూరాధ విజయం సాధించారు. ఒక్కొక్కరు 15 కోట్ల డబ్బులకు అమ్ముడుపోయారని అధికార పార్టీ చేసిన ఆరోపణలకు జనసేన రెబెల్ అభ్యర్ధి రాపాకా వరప్రసాద్ బలం చేకూర్చే వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీలో తమ అభ్యర్ధి గెలిచేందుకు టీడీపీకు 22 ఓట్లు కావల్సి ఉండగా నలుగురు పార్టీకు దూరంగా ఉండటంతో 19 మాత్రమే బలముంది. ఈలోగా ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు బాహాటంగా పార్టీకు వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తూ టీడీపీకు చేరువయ్యారు. అంటే టీడీపీ బలం 21కి చేరింది. ఇక టీడీపీ అభ్యర్ధి గెలవాలంటే మరో ఓటు కావాలి. ఓటింగ్ సమయానికి ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకు క్రాస్ చేయడంతో 23 ఓట్లతో పంచుమర్తి అనూరాధ విజయం సాధించారు. క్రాస్ ఓటింగ్ చేసిన ఇద్దరు ఎమ్మెల్యేలకు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిగా గుర్తించిన పార్టీ మొత్తం నలుగురినీ సస్పెండ్ చేసింది. ఒక్కొక్క ఎమ్మెల్యేను 15 కోట్లు పెట్టి టీడీపీ కొనుగోలు చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
ఇక ఈ వ్యాఖ్యలకు తోడుగా జనసేన రెబెల్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రలోభాలకు గురైన ఎమ్మెల్యేలను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. వాస్తవానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ తొలి బేరం తనకే వచ్చిందని టీడీపీ 10 కోట్లు ఆఫర్ చేసిందన్నారు. తాను కూడా సిగ్గు శరం వదిలేసుంటే 10 కోట్లు వచ్చి ఉండేవని స్పష్టం చేశారు. తన దగ్గర డబ్బులుండి వద్దనలేదని..జగన్‌ను నమ్మినందునే ఆఫర్ తిరస్కరించానన్నారు. సమాజంలో ఒకసారి పరువు పోతే ఉండలేమని చెప్పారు. తన ఓటు కోసం తన మిత్రుడజు కేఎస్ఎన్ రాజును టీడీపీ నేతలు సంప్రదించారన్నారు.
తనకు అభిమానం, మానం రెండూ ఉన్నాయని అందుకే క్రాస్ ఓటింగ్ చేయలేదన్నారు. సిగ్గు శరం వదిలేసుంటే ఇవాళ 10 కోట్లు వచ్చుండేవని చెప్పడం ద్వారా ప్రలోభానికి గురైన ఎమ్మెల్యేలపై పరోక్షంగా సెటైర్లు సంధించారు రాపాక వరప్రసాద్.
Also Read: LVM 3 Launch: ఎల్‌విఎం 3 రాకెట్ ప్రయోగం విజయవంతం, ఇస్రోకు ముఖ్యమంత్రి జగన్ అభినందనలు
Also Read: Old Pension Scheme: ఓపీఎస్ కోసం తెలంగాణ ఉద్యోగులు పోరాటం.. ఆందోళనలకు పిలుపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook