ప్రత్యేక హోదాకు మద్దతు ప్రకటించిన కేసీఆర్ !! దీని ఆంతర్యం ఏంటి ?

జాతీయ రాజకీయాలపై దృష్టిసారించిన కేసీఆర్ ..ఏపీ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

Last Updated : Dec 29, 2018, 07:47 PM IST
ప్రత్యేక హోదాకు మద్దతు ప్రకటించిన కేసీఆర్ !! దీని ఆంతర్యం ఏంటి ?

జాతీయ రాజకీయాలపై దృష్టిసారించిన కేసీఆర్ ఏపీ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తన వ్యూహంలో భాగంగా ఏపీలో సానుకూలవాతావరణం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మద్దతు పలికి సంచలనం సృష్టించారు.  శనివారం మీడియా సమావేశంలో ఏపీ రాజకీయాలపై స్పందించిన కేసీఆర్ ఈ మేరకు ప్రకటన చేశారు. 

చంద్రబాబుకు కేసీఆర్ కౌంటర్

ప్రత్యేక హోదాను కేసీఆ ర్అడ్డుపడుతున్నారనే చంద్రబాబు కామెంట్స్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ విధంగా స్పందించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ అవసరమైతే ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాను ప్రధానికి లేఖ రాస్తానని చెప్పారు. తెలంగాణలో పాటు ఏపీకి మేలు జరగాలనే తాము కొరుకుంటున్నామన్నారు. పారిశ్రామికరాయితీలిస్తే రెండు తెలుగు రాష్ట్రాలకు ఇవ్వాలని చట్టంలో స్పష్టంగా ఉందని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేశారు. 

బాబు ద్వంధ వైఖరి ఇదే..

ఈ సందర్భంగా చంద్రబాబు ను టార్గెట్ చేస్తూ కేసీఆర్ పలు విమర్శలు చేశారు. ఏపీ విషయంలో చంద్రబాబు స్టేట్‌మెంట్లు పరస్పద విరుద్ధంగా ఉన్నాయని కేసీఆర్ ఆరోపించారు. ఓపైపు ఏపీని ఇతర రాష్ట్రాల కంటే వేగంగా అభివృద్ధి చేస్తున్నానని చెబుతున్నారు... మరోవైపు రాష్ట్రానికి ఆదాయం లేదు... ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ మాట్లాడతారని..ఈ రెండింటిలో దేన్ని నమ్మాలని ఈ సందర్భంగా చంద్రబాబును కేసీఆర్ ప్రశ్నించారు. 

చంద్రబాబుపై ప్రతికారం కోసమేనా  ?

తెలంగాణ ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రచారం చేసిన సందర్భంలో తామూ ఏపీ రాజకీయాల్లో తలదూర్చుతామని కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికలు ముగియడం..తర్వాత ఏపీ లో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో చంద్రబాబును దెబ్బకొట్టేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా ఏపీ రాజకీయాలపై చొరవ చూపిస్తున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Trending News