Nara Lokesh: కుప్పం టు ఇచ్చాపురం పాదయాత్ర... జనవరి 27 నుంచి ఏడాది పాటు జనంలోనే నారా లోకేష్

Nara Lokesh: టీడీపీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు నారా లోకేష్. ఏడాదికి పైనా జనంలోనే ఉండనున్నారు నారా లోకేష్. 2023 జనవరి 27న మొదలై.. 2024 మార్చిలో ముగిసే విధంగా షెడ్యూల్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 2024మేలో జరగనున్నాయి

Written by - Srisailam | Last Updated : Nov 11, 2022, 03:00 PM IST
  • నారా లోకేష్ పాదయాత్రకు ముహుర్తం ఖరారు
  • జనవరి 27న కుప్పంలో యాత్ర ప్రారంభం
  • ఏడాది పాటు జనంలోనే ఉండనున్న లోకేష్
Nara Lokesh: కుప్పం టు ఇచ్చాపురం పాదయాత్ర... జనవరి 27 నుంచి ఏడాది పాటు జనంలోనే నారా లోకేష్

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం జరిగింది. గత కొన్ని నెలలుగా సాగుతున్న ప్రచారం నిజం కాబోతోంది. తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనంలోకి వెళ్లబోతున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆయన పాదయాత్ర చేయబోతున్నారు. నారా లోకేష్ పాదయాత్రకు అధికారికంగా ముహుర్తం ఖరారైంది. వచ్చే ఏడాది అంటే 2023 జనవరి 27 నుంచి లోకేష్ పాదయాత్ర మొదలు కానుంది. చిత్తూరు జిల్లాలోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం నుంచి ఆయన నడక ప్రారంభం కానుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగియనుంది.

టీడీపీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు నారా లోకేష్. ఏడాదికి పైనా జనంలోనే ఉండనున్నారు నారా లోకేష్. 2023 జనవరి 27న మొదలై.. 2024 మార్చిలో ముగిసే విధంగా షెడ్యూల్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 2024మేలో జరగనున్నాయి. మార్చి, ఏప్రిల్ లో షెడ్యూల్ వస్తుంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేనాటికి పాదయాత్ర ముగిసేలా ప్లాన్ చేస్తున్నారు. పాదయాత్ర ముగిసిన వెంటనే ఎన్నికల ప్రచారం చేసేలా టీడీపీ రోడ్ మ్యాప్ రెడీ చేస్తుందని తెలుస్తోంది.. తన పాదయాత్రలో  రైతులు, మహిళలు, నిరుద్యోగులపైనే లోకేష్ ప్రధానంగా ఫోకస్ చేయనున్నారని తెలుస్తోంది . నిరుద్యోగ సమస్యలు ప్రధానంగా ప్రస్తావిస్తారని అంటున్నారు. రైతాంగం, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వ తీరును ప్రశ్నించనున్నారు తన యాత్రలో యువతను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసేలా లోకేష్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. నిజానికి సంక్రాంతి తర్వాత జనవరి 26 రిపబ్లిక్ డే నుంచి నారా లోకేష్ పాదయాత్ర ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే  లోకేష్ లక్కీ నెంబర్ 9. దీంతో ఆయనకు కలిసివచ్చేలా 27 నుంచి పాదయాత్ర ప్రారంభించాలని డిసైడ్ చేశారని తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పాదయాత్రలకు మంచి గుర్తింపు ఉంది. 2004లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు వైఎస్సార్ రాజశేఖర్ రెడ్డి. 2002లో ఆయన చేసిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర వల్లే ఆయనకు విజయం దక్కిందనే టాక్ ఉంది. కాంగ్రెస్ నేతలు కూడా ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పారు. 2009లో రెండో సారి ఓడిపోయిన తర్వాత 2012లో వస్తున్నా మీ కోసం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. ఆరవై నాలుగేళ్ల వయస్సులోనూ ఆయన ఉత్సాహంగా నడిచారు. 2012 అక్టోబర్ గాంధీ జయంతి రోజున అనంతపురం జిల్లా హిందూపురం పాదయాత్ర ప్రారంభించిన చంద్రబాబు.. దాదాపు నాలుగు నెలల పాటు జనంలో తిరిగారు. 2014లో టీడీపీ విజయం సాధించడానికి చంద్రబాబు పాదయాత్ర దోహదపడిందని చెబుతారు.

ఇక 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత 2017లో పాదయాత్ర చేపట్టారు వైసీపీ అధినేత జగన్. నవంబర్ 6న ఇడుపులపాయలో ఆయన తన ప్రజా సంకల్పయాత్రని మొదలు పెట్టారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 13 జిల్లాలను టచ్ చేస్తూ జగన్ జనంలో నడిచారు. మూడు వందల 41 రోజుల పాటు పాదయాత్ర చేసిన జగన్..  134 నియోజవర్గాలను కవర్ చేస్తూ  మొత్తం 3వేల 6వందల 48 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.  2వేల 5వందల 16 గ్రామాల్లో జగన్ యాత్ర సాగింది. 124 బహిరంగ సభలు, 55 ఆత్మీయ సమవేశాల్లో ప్రసంగించారు వైఎస్ జగన్.

Also Read : Yashoda Twitter Review : యశోద ట్విట్టర్ రివ్యూ.. దుమ్ములేపిన సమంత.. కష్టానికి తగ్గ ప్రతిఫలం

Also Read : Pushpa 2: ప్రారంభమైన పుష్ప 2 షూటింగ్, పుష్ప 2లో ఆర్ఆర్ఆర్ సీన్ రిపీట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News