Kurnool police filed case against rk roja: వైసీపీ నేత, మాజీ మంత్రిపై కర్నూల్ లో కేసు నమోదైనట్లు తెలుస్తొంది. ఈ మేరకు దళిత సంఘాలు ఆమెపై కేసు నమోదు చేశారరు. గతంలో ఆమె పర్యాటక మంత్రిగా ఉన్నప్పుడు.. గుంటూరు జిల్లాలోని బాపట్లలో సూర్యలంక బీచ్‌కు వెళ్లారు. అప్పుడు.. ఒక దళిత ఉద్యోగితో రోజా చెప్పులు మోయించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనిపై దళిత సంఘాలు సైతం భగ్గుమన్న విషయం తెలిసిందే.
తాజాగా.. ఈ వ్యవహారం అప్పట్లోనే పెనుదుమారంగా మారింది. తాజాగా.. దళిత సంఘాల నేతలు. కర్నూల్ లోని మూడో టౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తొంది. దీంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. పర్యాటక శాఖ రిసార్ట్స్ వద్ద మంత్రికి అధికారులు స్వాగతం పలికి బీచ్ దగ్గరకు తీసుకెళ్లారు. ఆమె సముద్రపు నీటిలోకి దిగే ముందు ఒడ్డున చెప్పులు విడిచారు. ఆ తర్వాత ఒక ఉద్యోగికి దాని బాధ్యతలు అప్పగించారు. అంతే కాకుండా.. అతని చేత చెప్పుల్ని మోయించారు. ఈ వీడియోలు అప్పట్లో తెగ వైరల్ గా మారాయి.
ఈ ఘటనపై తాజాగా, మరొసారి వివాదం రాజుకుందని చెప్పుకొవచ్చు. ఇప్పటికే ఏపీ పోలీసులు.. పోసాని, శ్రీరెడ్డి, రామ్ గోపాల్ వర్మ, పలువురు వైసీపీ నేతలపై కేసులను నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, మరోసారి ఆర్కే రోజాపై కేసు నమోదు చేయడం మాత్రం ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకొవచ్చు. అదే విధంగా రోజాను వైసీపీ ఫైర్ బ్రాండ్ గా కూడా చెప్తుంటారు.
ఆమె గతంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లను టార్గెట్ చేసుకొని పలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తిరుమలలో కూడా రాజకీయాల గురించి మాట్లాడి ఆమె వివాదస్పదంగా మారిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ క్రమంలో రోజాపై కేసు నమోదు చేయడం మాత్రం వార్తలలో నిలిచిందని చెప్పుకొవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.