Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. మరో రెండ్రోజుల్లో అల్పపీడనం వాయుగుండంగా బలపడవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. ఫలితంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు వర్షసూచన జారీ అయింది.
దక్షిణ అండమాన్ సమీపంలో బంగాళాఖాతలో ఇవాళ ఏర్పడనున్న అల్పపీడనం మరో రెండ్రోజుల్లో అంటే ఈ నెల 29 నాటికి వాయుగుండంగా మారనుంది. ఫలితంగా ఏపీలో రానున్న ఐదురోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. మరోవైపు బంగాళాఖాతంలో ఇప్పటికే ఆవహించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ, రేపు అక్కడక్కడా వర్షాలు పడనున్నాయి. ఇవాళ అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాలు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇక ఉత్తర కోస్తా, యానంలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. అటు రాయలసీమ జిల్లాలకు సైతం మోస్తరు వర్ష సూచన ఉంది.
అకాల వర్షాల కారణంగా రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పంట చేతికి అందే సమయం కావడంతో వర్షాలంటే అన్నదాతలు భయపడుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వందలాది ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. కోతలు కోసి ఆరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో రైతాంగం ఆందోళన చెందుతోంది.
Also read: Lokesh Padayatra: నేటి నుంచే నారా లోకేశ్ పాదయాత్ర, విశాఖ వరకే యాత్ర
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook