HPCL Plant Accident: విశాఖలో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఎల్జీ పాలిమర్స్ ఘటన మరువకముందే మరో భారీ అగ్నిప్రమాదం జరగడంతో స్థానికంగా ఆందోళన రేగుతోంది.
విశాఖపట్నం హెచ్‌పీసీఎల్ ప్లాంట్‌లో(Hpcl Plant Fire Accident) భారీ అగ్ని ప్రమాదం తలెత్తింది. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి.సేఫ్టీ సైరన్ మోగడంతో వందలాది ఉద్యోగులు ప్రాణాలు కాపాడుకోడానికి పరుగులు తీశారు. భారీగా శబ్దం రావడంతో స్థానికంగా ఉన్న శ్రీహరిపురం, మల్కాపురం ప్రాంతీయులు ఆందోళన చెందారు. భయభ్రాంతులకు లోనయ్యారు.హెచ్‌పీసీఎల్ (HPCL Accident) ప్రమాదంతో దట్టమైన పొగలు చుట్టూ వ్యాపించాయి. రంగంలో దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. ప్రమాదస్థలికి మంత్రి అవంతి శ్రీనివాస్, సీపీ మనీష్ కుమార్ చేరుకున్నారు.
ఓవర్ హెడ్ పైప్ లైన్‌లో లీకేజ్ వల్లనే ప్రమాదం జరిగిందని కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. సీడీయూ మూడవ యూనిట్‌లో ప్రమాదం జరిగిందని..ఓవర్ హెడ్ పైప్‌లైన్ దెబ్బతినడం వల్ల లీకేజ్ జరిగిందన్నారు. యూనిట్ మొత్తాన్ని షట్‌డౌన్ చేశారు. పరిస్థితి అదుపులో ఉందని..ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని విశాఖ జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రమాదం జరిగిన 15 నిమిషాల్లోనే సమాచారం రావడంతో అప్రమత్తమై..పరిస్థితిని అదుపు చేశామన్నారు.
హెచ్‌పీసీఎల్(Hpcl)లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి.సేఫ్టీ సైరన్ మోగడంతో ఉద్యోగులు పరుగులు తీశారు. భారీ శబ్ధం రావడంతో స్థానికులు స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. హెచ్‌పీసీఎల్ నుంచి సాధారణం కంటే దట్టంగా పొగలు వ్యాపించాయి. పరిస్థితిని ఫైర్ సిబ్బంది అదుపులోకి తెచ్చారు. హెచ్‌పీసీఎల్ ప్రమాద స్థలానికి మంత్రి అవంతి శ్రీనివాస్(Minister Avanti Srinivas), సీపీ మనీష్ కుమార్ చేరుకున్నారు.
Also read: Anandaiah medicine: కృష్ణపట్నం మందుపై త్వరలో క్లినికల్ ట్రయల్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook