YSR Birth Anniversary: ఇడుపులపాయలో అర్ధరాత్రి చర్చలు సఫలం! జగన్, షర్మిల మధ్య రాజీ.. వివేకా కూతురుతోనూ సయోధ్య?

YSR Birth Anniversary: వైఎస్సార్ కుటుంబంలో విభేదాలు సమసిపోయాయా? జగన్ , షర్మిల మధ్య రాజీ కుదిరిందా? వైఎస్ వివేకా కుటుంబంతోనూ సయోధ్య కుదిరిందా? అంటే దివంగత నేత వైఎస్సార్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో జరిగిన పరిణామాలతో అవుననే తెలుస్తోంది.

Written by - Srisailam | Last Updated : Jul 8, 2022, 11:45 AM IST
  • ఇడుపులపాయలో ఘనంగా వైఎస్సార్ జయంతి
  • జగన్, విజయమ్మ, షర్మిల నివాళులు
  • కుటుంబంలో విభేదాలు సమసిపోయాయా?
YSR Birth Anniversary: ఇడుపులపాయలో అర్ధరాత్రి చర్చలు సఫలం! జగన్, షర్మిల మధ్య రాజీ..  వివేకా కూతురుతోనూ సయోధ్య?

YSR Birth Anniversary: వైఎస్సార్ కుటుంబంలో విభేదాలు సమసిపోయాయా? జగన్ , షర్మిల మధ్య రాజీ కుదిరిందా? వైఎస్ వివేకా కుటుంబంతోనూ సయోధ్య కుదిరిందా? అంటే దివంగత నేత వైఎస్సార్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో జరిగిన పరిణామాలతో అవుననే తెలుస్తోంది. వైఎస్సార్ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులంతా కలిసి నివాళి అర్పించారు. సీఎం జగన్ తో పాటు విజయమ్మ, వైఎస్ షర్మిల ఇడుపులపాయకు ఒకేసారి వచ్చారు. వైఎస్సార్ ఘాట్ దగ్గర నివాళి అర్పించారు. కాసేపు ప్రార్ధనలు చేశారు. ఈ సందర్భంగా విజయమ్మతో చాలా సన్నిహితంగా మెలిగారు జగన్. ఈ పరిణామాలను చూసిన వారంతా వైఎస్సార్ కుటుంబంలో విభేదాలు సమసిపోయాయని చెబుతున్నారు.

గత ఏడాది వైఎస్ జయంతి రోజున కుటుంబ సభ్యులు ఎవరికివారుగానే వచ్చారు. విజయమ్మ, షర్మిల ఉదయం వచ్చి నివాళి అర్పించగా.. సీఎం జగన్ మాత్రం సాయంత్రం వచ్చ తన తండ్రికి నివాళి అర్పించారు. ఇది పెద్ద చర్చనీయాంశం అయింది. సాధారణంగా ఎప్పుడైనా జగన్ తో పాటు కుటుంబ సభ్యులు ఉదయమే వచ్చి నివాళి అర్పించేవారు. కాని గత ఏడాది సీఎం జగన్ మాత్రం సాయంత్రం వచ్చి నివాళి అర్పించారు. దీనిపై వైసీపీలోనూ అసంతృప్తి వ్యక్తమైంది. వైఎస్ అభిమానులు ఆందోళనకు లోనయ్యారు. అయితే తన తల్లి, చెల్లితో విభేదాలు ఉండటంతో.. వాళ్లు వచ్చి వెళ్లాక రావాలనే ఉద్దేశంతోనే సీఎం జనగ్ ఇడుపులపాయకు సాయంత్రం వచ్చారని టాక్ నడిచింది. ఆ తర్వాత కూడా విజయమ్మ, షర్మిలతో జగన్ కలవలేదు. ఇటీవలే విజయమ్మ పుట్టినరోజు జరిగింది. అయితే పుట్టినరోజున కొడుకు జగన్ దగ్గరకు వెళ్లకుండా.. ఖమ్మంలో పాదయాత్ర చేస్తున్నషర్మిల దగ్గరకు వెళ్లింది విజయమ్మ. అక్కడే తన క్యాంపులోనే తల్లి విజయమ్మతో కేక్ కట్ చేయించింది షర్మిల. ఈ ఘటన తర్వాత జగన్ , విజయమ్మ మధ్య గ్యాప్ మరింతగా పెరిగిందనే ప్రచారం జరిగింది.

వైఎస్సార్ కుటుంబంలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో గుంటూరులో జరుగుతున్న ప్లీనరీకి విజయమ్మ వస్తారా రారా అన్న అనుమానాలు వచ్చాయి. ఈ ఏడాది కూడా ఇడుపులపాయ  వైఎస్సార్ ఘాట్ కు విజయమ్మ, జగన్, షర్మిల వేరువేరుగా వస్తారనే చర్చ జరిగింది. కాని ఈసారి వైఎస్సార్ ఘాట్ కు కలిసేవచ్చారు విజయమ్మ, జగన్, షర్మిల.ఇడుపులపాయలో ఉన్నంత సేపు తల్లితో మాట్లాడుతూ కనిపించారు జగన్. దీంతో వైఎస్సార్ కుటుంబం అంతా కలిసిపోయిందని తెలుస్తోంది. వీళ్లంతా కలిపోవడం వెనుక పెద్ద కథే నడిచిందని తెలుస్తోంది. సీఎం జగన్ గురువారం సాయంత్రమే ఇడుపులపాయకు వచ్చారు. విజయమ్మ, షర్మిల కూడా గురువారం సాయంత్రమే వచ్చారు. వీళ్ల మధ్య రాత్రంతా చర్చలు జరిగాయని తెలుస్తోంది. చివరకు చర్చలు సఫలం అయ్యాయని, అంతా కలిసిపోయారని అంటున్నారు. అందుకే ఉదయం అందరూ కలిసే ఇడుపులపాయకు వచ్చారని వైసీపీ వర్గాల సమాచారం.

విజయమ్మ, షర్మిలతో సఖ్యత కుదరడమే కాదు కొన్ని రోజులుగా తమతో దూరంగా ఉంటున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులతోనూ జగన్ కు సయోధ్య కుదిరిందని చెబుతున్నారు. ఇకపై వివేకా కూతురుకు ప్రాధాన్యత ఇవ్వాలని.. వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక స్థానం నుంచి ఆమెను బరిలోకి దింపాలని నిర్ణయించారని తెలుస్తోంది. కడప జిల్లాలోని జమ్మలమడుగు నుంచి తాను పోటీ చేసి.. సునితను పులివెందుల నుంచి పోటీ చేయించే యోచనలో సీఎం జగన్ ఉన్నారని అంటున్నారు. మొత్తంగా వైఎస్సార్ ప్యామిలీ కలిసి ఇడుపులపాయ ఘాట్ రావడంతో వైసీపీ కేడర్ లో మాత్రం ఉత్సాహం కనిపిస్తోంది.

Also Read: Secunderabad Agnipath Violence: నన్ను ఇరికించారు.. సికింద్రాబాద్ ఘటనపై పోలీసుల విచారణలో ఆవుల సుబ్బారావు..

Also Read: Driving License: డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఏం చేయాలి, ఇకపై నో ఆర్టీవో ఆఫీస్

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News