Earthquake in Srikakulam: శ్రీకాకుళంలో భూకంపం.. అంతా నిద్రలో ఉన్న వేళ.. భయంతో జనం పరుగులు..

Earthquake in Srikakulam: శ్రీకాకుళం జిల్లాలోని పలుచోట్ల మంగళవారం (జనవరి 4) రాత్రి భూకంపం సంభవించింది. రాత్రి 10గం. తర్వాత అంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా భూ ప్రకంపనలు సంభవించాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 5, 2022, 08:59 AM IST
  • శ్రీకాకుళం జిల్లాలో స్వల్ప భూకంపం
  • భయంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు
  • కొన్నిచోట్ల బీటలు వారిన ఇళ్లు
Earthquake in Srikakulam: శ్రీకాకుళంలో భూకంపం.. అంతా నిద్రలో ఉన్న వేళ.. భయంతో జనం పరుగులు..

Earthquake in Srikakulam: శ్రీకాకుళం జిల్లాలోని పలుచోట్ల మంగళవారం (జనవరి 4) రాత్రి భూకంపం సంభవించింది. రాత్రి 10గం. తర్వాత అంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో జనం భయంతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. భయాందోళనతో చాలాసేపు వీధుల్లోనే ఉండిపోయారు. వారం రోజుల వ్యవధిలో రెండోసారి భూప్రకంపనలు సంభవించడంతో స్థానికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి మండలాల్లో భూకంపం (Earthquake in AP) సంభవించినట్లు చెబుతున్నారు. ఈ మండలాల్లోని రత్తకర్ణ, తేలుకుంచి, అమీన్‌సాహిబ్ పేట, పురుషోత్తపురంతో పాటు ఒడిశా సమీప ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించినట్లు తెలుస్తోంది. ఇచ్చాపురంలో 10 నిమిషాల వ్యవధిలోనే మూడుసార్లు భూప్రకంపనలు సంభవించినట్లు సమాచారం. భూప్రకంపనలతో ఇళ్లల్లోని వస్తువులన్నీ కిందపడిపోయినట్లు, మనుషులు ఒక్కసారిగా కుదుపుకు గురైనట్లు స్థానికులు వెల్లడించారు. భూప్రకంపనలపై స్థానిక అధికారులు మాట్లాడుతూ... భూకంపం సంభవించినట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. అయితే దాని తీవ్రత చాలా తక్కువగా ఉందన్నారు.

భూకంప భయంతో కొంతమంది తెల్లవారుజాము వరకు వీధుల్లోనే ఉండిపోయినట్లు తెలుస్తోంది. మళ్లీ ఎక్కడ భూకంపం (Earthquake) వస్తుందేమోనన్న భయంతో ఇళ్లల్లోకి వెళ్లేందుకు భయపడ్డారు. ఓవైపు చలి వణికిస్తున్నా.. భూకంప భయం వెంటాడటంతో నిద్ర మానుకుని వీధుల్లోనే ఉండిపోయారు. భూకంప ప్రభావంతో కొన్నిచోట్ల ఇళ్లకు బీటలు వారినట్లు తెలుస్తోంది.

Also Read: Horoscope Today 5 January 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ఇవాళ అన్నివిధాలా కలిసొస్తుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News