AP Assembly Elections 2024: నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఎలాగైనా పోటీ చేయాలని పట్టుదలతో ఉన్నారు. కూటమి నుంచి ఎంపీగా పోటీ చేద్దామనుని ముందుగా అనుకున్నా.. పొత్తుల్లో భాగంగా ఆ సీటు బీజేపీకి వెళ్లిపోయింది. చివరకు రఘురామకు టికెట్ ఇప్పించేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రయత్నించినా.. బీజేపీ తమకే సీటు కావాలని పట్టుబట్టింది. బీజేపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస వర్మ బరిలో ఉన్నారు. మరోవైపు తాను పోటీ చేయడం మాత్రం పక్కా అని అంటున్నారు ఎంపీ రఘురామ. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేయడం తన ఆశయమని ఆయన అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదఅమిరంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననేది 2 రోజుల్లో తేలుతుందన్నారు RRR. ఎంపీగానా, ఎమ్మెల్యేగానా అనేది చూడాలన్నారు. పోటీ చేయడమైతే పక్కా అని తేల్చేశారు. ఎంపీగా పోటీ చేయాలనేది తన ఆశ అని.. అసెంబ్లీలో ఉండాలనేది ప్రజల కోరిక అని అన్నారు. చాలా మంది తనను అసెంబ్లీలో స్పీకర్‌గా చూడాలనుకుంటున్నారని అని అన్నారు. తాను కోరుకుంటున్నా కేంద్రమా.. ప్రజలు కోరుతున్నా రాష్ట్రమా అనేది త్వరలో తేలుందన్నారు. శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
అసెంబ్లీ నుంచి పోటీ చేయడంపై ఇప్పటికే చంద్రబాబుతో రఘురామ చర్చించినట్లు తెలిసింది. ఎమ్మెల్యే టికెట్‌లో ఆయన భరోసా ఇచ్చినట్లు సమాచారం. RRR పోటీపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఇప్పటికే హింట్ ఇచ్చారు. విజయవాడలో రఘురామతో కలిసున్న ఫొటోను షేర్ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల సమరంలోకి అడుగుపెడుతున్న మా అగ్రజులు రఘురామకృష్ణరాజు గారితో అంటూ ఆయన ట్వీట్ చేయడంతో క్లారిటీ ఇచ్చేశారు. రఘురామ టీడీపీలో చేరడం.. టికెట్ ఖాయమవ్వడం లాంఛనంగా మారింది.
2019 ఎన్నికల్లో నరసాపురం లోక్‌సభ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ నుంచి రఘురామ పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజుపై 31,909 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే ఆయన ఎంపీగా గెలుపొందిన కొద్దిరోజులకే సొంత పార్టీపైనే విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని, ప్రభుత్వ పథకాలను ఆయన ప్రశ్నించారు. ఆయన పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని.. ఎంపీగా అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్‌కు వైసీపీ ఫిర్యాదు చేసింది. ఈ ఎన్నికల్లో కూటమి నుంచి నరసాపురం ఎంపీగా పోటీ చేద్దామని అనుకున్నా.. పొత్తుల్లో భాగంగా కుదరలేదు.
Also Read: Anaparthi Seat: అనపర్తి అసమ్మతిపై చంద్రబాబు దిగొచ్చినట్టేనా, సీటు మార్చే ఆలోచన
Also Read: Save The Tigers 2: బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్.. ఇండియా టాప్ 3 లిస్టులో ‘సేవ్ ది టైగర్స్’
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook