Newly wed woman dies: నవవధువు ప్రాణాలు తీసిన రోడ్డు ప్రమాదం

Newly married woman died : అంతవరకు సరదాసరదాగా మాట్లాడుకుంటూ బైక్ నడుపుతూ ఉన్నాడు.. ఆ అబ్బాయి. ఇక వెనుక కూర్చొన్న అతని భార్య ఆ ఊసులన్నీ వింటూ కొత్త జీవితంపై ఎన్నో ఆశలతో ఊహల్లో విహరిస్తూ ఉంది. ఇంతలోనే మృత్యువు ముంచుకొచ్చింది. ఆ నవ వధువు ప్రాణాలను అర్ధంతరంగా తీసుకెళ్లింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 13, 2021, 12:20 PM IST
  • డ్డు ప్రమాదంలో నవవధువు మృతి
  • విశాఖ జిల్లా పాడేరు మండలం వంతాడపల్లి చెక్‌పోస్ట్‌ వద్ద ఘటన
  • నవదంపతుల బైక్‌ను ఢీకొట్టిన కారు
  • దంపతులకు మూడు నెలల కిందటే వివాహం
Newly wed woman dies: నవవధువు ప్రాణాలు తీసిన రోడ్డు ప్రమాదం

Newly wed woman dies road accident in vishakapatnam Paderu Mandal Vanthadapalli: ఆ జంటకు కొత్తగా పెళ్లయ్యింది. బంధువులతో కలిసి అలా సరాదాగా పర్యాటక కేంద్రానికి వెళ్లాలనుకున్నారు. అనుకున్నట్లుగానే బంధువులతో పాటు కలిసి బైకుపై ఈ నవజంట కూడా సరాదాగా గడిపేందుకు బయల్దేరింది. అంతవరకు సరదాసరదాగా మాట్లాడుకుంటూ బైక్ (Bike) నడుపుతూ ఉన్నాడు.. ఆ అబ్బాయి. ఇక వెనుక కూర్చొన్న అతని భార్య (Newly married woman) ఆ ఊసులన్నీ వింటూ కొత్త జీవితంపై ఎన్నో ఆశలతో ఊహల్లో విహరిస్తూ ఉంది. ఇంతలోనే మృత్యువు (Death) ముంచుకొచ్చింది. ఆ నవ వధువు ప్రాణాలను అర్ధంతరంగా తీసుకెళ్లింది. 

రోడ్డు ప్రమాదంలో (Road accident0 ఒక నవవధువు మృతి చెందింది. ఈ ఘటన విశాఖ జిల్లా పాడేరు మండలం (Visakhapatnam District Paderu) వంతాడపల్లి చెక్‌పోస్ట్‌ (Vanthadapalli check post) వద్ద జరిగింది. ప్రముఖ పర్యాటక కేంద్రమైన వంజంగికి నవ దంపతులతో పాటు వారి బంధువులు మూడు బైకులపై బయల్దేరారు. వంతాడపల్లె చెక్‌పోస్ట్‌ వద్దకు వారు చేరుకోగానే.. నవదంపతుల బైక్‌ను ఓ కారు (Car) ఢీకొట్టింది.

Also Read :Rape Case on Hardik Pandya: సంచలనం.. టీమిండియా ఆటగాళ్లపై 'గ్యాంగ్‌ రేప్‌' ఆరోపణలు!

దీంతో నవ వధువు హేమ(24) (New bride Hema) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పొయింది. ఆమె భర్త తరుణ్‌ కుమార్‌కు (Tarun Kumar) తీవ్రగాయాలయ్యాయి. తరుణ్‌ కుమార్‌108 వాహనంలో పాడేరు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం (Accident) బారిన పడిన దంపతులకు మూడు నెలల కిందటే వివాహం (Marriage) అయినట్లు తెలుస్తోంది.

Also Read : Watch Video: ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అగ్ని ప్రమాదం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News