ఆంధ్రప్రదేశ్‌లో మైనారిటీ సంక్షేమ మంత్రిత్వ శాఖకు మంత్రి లేకపోవడం అత్యంత శోచనీయమని కర్ణాటక రాష్ట్రమంత్రి యూటి ఖాదర్ విమర్శలు గుప్పించారు. గుంటూరు ఏసీ కాలేజీ గ్రౌండ్స్ ప్రాంతంలో జరిగిన ఇందిరాగాంధీ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా జరిగిన మైనారిటీ సదస్సుకు ఆయన అతిధిగా హాజరై తన అభిప్రాయాలను పంచుకున్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం గానీ, ఏపీలో చంద్రబాబు నాయుడు సర్కారు గానీ మైనారిటీల సమస్యల గురించి ఆలోచించక పోవడం ఆశ్చర్యకరమన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో మైనారిటీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఎవరికీ కేటాయించలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోర్టుఫోలియోలోనే అది ఇంకా కొనసాగుతుంది. అదే విషయాన్ని హైలెట్ చేస్తూ, ఖాదర్ విమర్శలు చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ ప్రముఖులు హాజరయ్యారు.